Balakrishna Boyapati Combo: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవుతుంది. నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య చాలా తక్కువ సమయంలోనే మాస్ హీరోగా అవతరించాడు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ 4 హీరోల్లో తను కూడా ఒకడిగా మారడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…గతంలో బాలయ్య వరుస ప్లాపు ల్లో ఉన్నప్పుడు బోయపాటి శ్రీను సింహా సినిమాతో భారీ సక్సెస్ ని కట్టబెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరోసారి పుంజుకున్న బాలయ్య వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పటివరకు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో మూడు సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తే రీసెంట్ గా వచ్చిన ‘అఖండ 2’ సినిమా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో బాలయ్య – బోయపాటి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. మరి ఇకమీదట వీళ్ళ కాంబినేషన్లో మనం సినిమా చూడలేమా? అనే ధోరణిలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట వీళ్ళ కాంబో లో మరో సినిమా వచ్చే అవకాశమైతే లేనట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా అద్భుతం జరిగి మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధిస్తే తప్ప అభిమానుల దహమైతే తీరదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా రావడం అనేది అసాధ్యం అనే చెప్పాలి…
సినిమా సక్సెస్ సాధించినప్పుడు అందరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుంది. ఒకసారి ప్లాప్ వచ్చింది అంటే మాత్రం రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయని చెప్పడానికి వీళ్ళని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. మొన్నటిదాకా బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి రేకెత్తించేది. కానీ అఖండ 2 సినిమాని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆ కాంబినేషన్ మీద అంచనాలైతే తగ్గిపోయాయి…