Telugu Stars International Fame: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. కాబట్టి భారీ సక్సెసు లైతే దక్కుతుంటాయి. ఇక వాళ్లతో పాటు సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడంతో తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి స్టార్ హీరోలు ముందు వరుసలో ఉంటున్నారు… స్టార్ హీరోల సినిమాలకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాలో యావత్ ప్రేక్షక లోకాన్ని మెప్పించగలుగుతున్నారు.
ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ విషయం పక్కన పెడితే ఇతర దేశాల్లో కూడా మన హీరోలకు భారీ మార్కెట్ ఉందనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా జపాన్ లో మన హీరోలకు భారీ క్రేజ్ ఉంది. చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి నటులు కాకుండా రజనీకాంత్, ఎన్టీఆర్ లకు జపాన్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.
వాళ్ళ సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి అక్కడ భారీ బ్లాక్ బాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు సైతం అక్కడ మంచి కలెక్షన్స్ ని కొల్లగొడుతుంటాయి… రజినీకాంత్ మొదట జపాన్ మార్కెట్ ను కబ్జా చేసేస్తే తన తర్వాత ఎన్టీఆర్ జపాన్ వాళ్లకు హాట్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు… ఇక్కడ ప్లాప్ అయిన అశోక్, ఊసరవెల్లి లాంటి సినిమాలు సైతం జపాన్లో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టాయి అంటే మామూలు విషయం కాదు…
ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న మన హీరోలు ఇతర దేశాల్లో కూడా వాళ్ళ మార్కెట్ ని విస్తరించుకోవడం అనేది ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని కలిగిస్తుంది… ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు కాబట్టి ఇక మీదట రాబోయే రోజుల్లో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రతి ఒక్కరు రెడీ అవుతున్నారు…