Rajamouli Shankar Technology Comparison: ప్రస్తుతం దర్శకులందరు డిఫరెంట్ సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో అత్యాధునికమైన టెక్నాలజీని వాడుతున్నారు. విజువల్ వండర్స్ ను క్రియేట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకొని భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తున్నారు. సినిమాలు సక్సెస్ అయితే పర్లేదు కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ కు తీవ్రమైన నష్టమైతే వస్తాయి. తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి చెందిన శంకర్ లాంటి దర్శకుడు సైతం గతంలో విజువల్ వండర్స్ ని క్రియేట్ చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించడం లేదు…ఇక రాజమౌళి లాంటి దర్శకుడు పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే రాబడుతున్నాడు. ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే 12 కూడా సూపర్ హిట్స్ అవ్వడంతో ఆయన టాప్ డైరెక్టర్ గా మారాడు. మరి ఆయన విషయంలో ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడటం లేదు. తనకి భారీ బడ్జెట్ పెట్టడానికి సైతం ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.
Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్
అయితే రాజమౌళి, శంకర్ కంటే ముందే ఒక తెలుగు దర్శకుడు రోబో తో ఒక సినిమానైతే చేశాడు. ఇంతకీ ఆయన ఎవరంటే ‘ఎస్ వి కృష్ణారెడ్డి’ కావడం విశేషం…ఆయన చేసిన ‘ఘటోత్కచుడు’ సినిమాలో రోబో కి ఒక కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ రోబోను తను చాలా బాగా వాడుకున్నాడు.
అలాగే టెక్నాలజీని సైతం అప్పుడే తను స్టార్ట్ చేశాడు. అలాంటి ఎస్వీ కృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో కొంతవరకు తడబడుతున్నప్పటికి వీళ్ళందరు ఇప్పుడు చేస్తున్న వండర్స్ ని తను ఎప్పుడో చేశాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…
ప్రస్తుతం ఆయన ‘వేదవ్యాస్’ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… ఏది ఏమైనా కూడా ఎస్పీ కృష్ణారెడ్డి తెలుగు సినిమా దర్శకుడు కావడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. అప్పట్లో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేశాడు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, దర్శకత్వం అన్ని తనే చేసేవాడు…