spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajamouli- Mahesh Movie: రాజమౌళి-మహేశ్ సినిమా అప్డేట్ : నరరూప రాక్షకులతో తలపడనున్న మహేశ్

Rajamouli- Mahesh Movie: రాజమౌళి-మహేశ్ సినిమా అప్డేట్ : నరరూప రాక్షకులతో తలపడనున్న మహేశ్

Rajamouli- Mahesh Movie: ‘ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి మహేశ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అనౌన్స్ ఎప్పుడో చేయడంతో దాని కోసం మహేశ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ లో ఉన్న జక్కన్న తిరిగి రాగానే ముహూర్తం చూసి మొదలు పెట్టే అవకాశం ఉంది. అయితే అప్పుడే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎప్పటి లాగే ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. దీంతో స్టోరీ అద్భుతంగా ఉంటుందని హోప్స్ పెట్టుకున్నారు. అయితే తాజాగా దీనిపై మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఊహించని ఫైట్ ఉంటుందని అంటున్నారు. మహేశ్ నరరూప రాక్షసులతో తలపడనున్నాడట.. ఆ వివరాలేంటో చూద్దాం.

Rajamouli- Mahesh Movie
Rajamouli- Mahesh Movie

రాజమౌళి సినిమాలో ఫైట్స్ మాములుగా ఉండవు. బాడీ బిల్డింగ్ ఉన్న హీరోతో పాటు.. అంతే స్థాయిలో విలన్స్ ఉంటారు. అవసరమైతే హీరోతో ఎక్సరసైజ్ లు చేయించైనా.. భారీ శరీరాన్ని ఏర్పాటు చేయిస్తాడు. ఆ విషయాన్ని నాటి ఛత్రపతి నుంచి నేటి బాహుబలి వరకు తెరపై చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మహేశ్ తో తీయబోయే సినిమాలో కూడా భారీ ఫైట్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఫైట్స్ కూడా లోకల్ గా కాకుండా విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ వేస్తున్నారట.

ఈ సినిమా మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లో తీసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని భారీ ఫైట్స్ చిత్రీకరిస్తారట. ఈ ఫైట్ లో సాధారణ మనుషులు కాకుండా నరరూప రాక్షకులతో మహేశ్ తలపడేలా సెట్ చేస్తున్నారట. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ నరమాంస భక్షకులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో సినిమాలో భాగంగా మహేశ్ అక్కడికి వెళ్లిన సందర్భంగా అక్కడి వారితో ఫైట్ చేసే విధంగా సినిమాను చిత్రీకరిస్తారట. ఇందు కోసం కొందరు ఫారిన్ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించనున్నాడట జక్కన్న.

Rajamouli- Mahesh Movie
Rajamouli- Mahesh Movie

ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే వందల కోట్లు ఉంటుంది. సీన్ అద్భుతంగా రావడానికి ఖర్చు ఎంతైనా కాంప్రమైజ్ కాడు. ఆయన తీసే ప్రతీ సినిమాలో ఏదో ఒకటి హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ ఫైట్స్ ప్రధానంగా కనిపించాయి. ఇప్పుడు కూడా మహేశ్ తో తీయబోయే సినిమాలో ఫైట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేశాడట. ఇందులో భాగంగా నరరూప రాక్షకులతో ఫైట్స్ పెట్టాలని అనుకున్నాట. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇలాంటిది ఉంటే బాటుంటుంని ఫ్యాన్ష్ చర్చించుకుంటున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper