https://oktelugu.com/

Akhilesh Yadav: అఖిలేష్ ఎన్నికల ఖర్చులను కేసీఆర్, జగన్ సర్జారట

Akhilesh Yadav: ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. దీంతో ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అప్రతిహ విజయయాత్ర కొనసాగించింది. బీజేపీకి పోటీనిచ్చిన సమాజ్ వాదీ పార్టీకి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనే అనుమానం అందరిలో కలుగుతోంది. దీనికి బీజేపీ నేతలు మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పీకి సాయం అందినట్లు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యూపీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 18, 2022 / 11:24 AM IST
    Follow us on

    Akhilesh Yadav: ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. దీంతో ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అప్రతిహ విజయయాత్ర కొనసాగించింది. బీజేపీకి పోటీనిచ్చిన సమాజ్ వాదీ పార్టీకి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనే అనుమానం అందరిలో కలుగుతోంది. దీనికి బీజేపీ నేతలు మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పీకి సాయం అందినట్లు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

    Akhilesh Yadav

    యూపీ దేశానికే గుండెకాయ లాంటిది. ఇక్కడ విజయం సాధిస్తే దేశంలో తన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీని నిలువరించాలనే క్రమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పరోక్షంగా అఖిలేష్ యాదవ్ కు సాయం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ బీజేపీని రాజకీయ శత్రువుగా భావిస్తోంది. జగన్ కూడా యూపీలో బీజేపీకి భంగపాటు ఎదురైతే మద్దతు కోసం తమ పార్టీపై ఆధారపడుతుందనే ఉద్దేశంతో ఆలోచించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

    Also Read: పవన్ కళ్యాణ్ ఆఫర్ పై టీడీపీ మౌనం.. అసలు కారణం ఇదేనా?

    టీఆర్ఎస్, వైసీపీ డబ్బులు పంపినట్లు నిజంగా ఆధారాలు దొరికితే వాటి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో బీజేపీ తన ప్రత్యర్థులపై పంజా విసిరేందుకు వెనుకాడదు. ఏదో కేసులో ఇరికిస్తే మన నేతలు లాక్కోలేక పీక్కోలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు వీరికి ఇలాంటి బుద్ధి పుడుతుందని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్, వైసీపీలు నిజంగానే డబ్బు పంపించాయా? ఒక వేళ పంపితే ఎలా పంపారు? ఏ మార్గంలో లావాదేవీలు జరిగాయి? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

    బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ వ్యవహరించదనే విషయం తెలుస్తోంది. ఎందుకంటే జగన్ పై ఉన్న కేసుల క్రమంలో ఆయన బీజేపీపై పోరాటం చేయడానికి ముందుకు రారని తెలిసినా ఏమో ఒక వేళ చేస్తారేమో అనే సందేహాలు వస్తున్నాయి. ఈ పార్టీలు ఎస్పీకి డబ్బు పంపితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇన్నాళ్లు బీజేపీ నేతలు చెబుతూనే ఉన్నారు. టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్నందున దీనిపై సీరియస్ గానే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

    Also Read: హెల్మెట్, పుచ్చకాయ.. హైదరాబాద్ పోలీస్ వీడియో వైరల్

    Tags