ప్రియాంక చోప్రా న్యూయార్క్ లో సోనా పేరిట ఇండియన్ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో రెస్టారెంట్ బిజినెస్ లో అనుభవం లేకపోయినా ఈ బోల్డ్ బ్యూటీ వ్యాపారం మొత్తానికి మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోందట. ప్రతి వారం తన రెస్టారెంట్ కి వచ్చే కస్టమర్స్ కి కొత్త స్కీమ్స్ ను పెడుతూ వాళ్ళను బాగా ఆకర్షిస్తోంది. దీనికితోడు గ్లోబల్ బ్యూటీ వంటలు రుచి చూడాలనే ఆత్రుతతో కుర్రాళ్ళు ఆమె రెస్టారెంట్ కి ఎక్కువగా వస్తున్నారట.
అందుకు తగ్గట్టుగానే ప్రియాంక తన రెస్టారెంట్ లో సరికొత్త పద్ధతులు ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా తినే ఫుడ్ కి తగ్గట్టు మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుందట. అందుకోసం ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో మ్యూజిక్ సిస్టమ్ ను పెట్టింది. అలాగే ఫుడ్ మెనూలో ఏ రెస్టారెంట్ లో దొరకని ఐటమ్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇక ఇంటీరియర్ అయితే తన టేస్ట్ కు తగ్గట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది.
ఆ మధ్య ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అన్నట్టు ఇదొక ఇండియన్ రెస్టారెంట్ అన్నమాట. సిసలైన భారతీయ రుచుల సమ్మేళనం ఇందులో ఉండేలా ఈ హాట్ భామ గట్టిగా ప్లాన్ చేసింది. ఇక ఈ రెస్టారెంట్ లోకి అడుగుపెడితే ఇండియాలో ఉండే ఫీలింగ్ వచ్చేలా ప్రియాంక, కొన్ని త్రీడి వాల్ పోస్టర్స్ ను స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించింది.
ఇక మాస్టర్ చెఫ్ హరినాయక్ అనే గ్రేట్ చెఫ్ ఈ రెస్టారెంట్ లో మెనూ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అతను చేసిన ఫుడ్ తిన్న వారెవ్వరూ అతనిని లైఫ్ లో మరిచిపోలేరట. అంత గొప్ప టేస్ట్ ఉండేలా అతను వండుతాడట. రెస్టారెంట్ కు సంబంధించి మ్యూజిక్, మెనూ, ఇంటీరియర్ అంతా ప్రియాంక చోప్రా టేస్ట్ కు తగ్గట్టు డిజైన్ చేశారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Priyanka chopras sona restaurant business is good
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com