Priyanka Chopra comments on Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇటు అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో, అటు మూవీ లవర్స్ కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలం నుండి సరైన సూపర్ హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న రామ్ చరణ్, ఈ సినిమాతో కచ్చితంగా కుంభస్థలం బద్దలు కొట్టే రేంజ్ లో హిట్ ని అందుకోబోతున్నాడని, గ్లింప్స్ వీడియో విడుదలైనప్పుడే అందరూ అంచనా వేశారు. ఆ తర్వాత ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా హిస్టరీ క్రియేట్ చేసే రేంజ్ లో సూపర్ హిట్ అవ్వడం , ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాట కూడా సూపర్ హిట్ అవ్వడం తో ఈ సినిమా కచ్చితంగా రామ్ చరణ్ కెరీర్ లో ‘రంగస్థలం’ రేంజ్ హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
ప్రొమోషన్స్ విషయం లో అభిమానులు కాస్త మొదట్లో బాధపడ్డారు కానీ , రీసెంట్ గా వరుసపెట్టి ఇంటర్వ్యూస్ తో , నాన్ స్టాప్ స్పెషల్ ఈవెంట్స్ తో కావాల్సినంత ప్రొమోషన్స్ చేశారు. అయితే కాసేపటి క్రితమే గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించి , హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్థిరపడిన ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమా ట్రైలర్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ వేసింది. ఆమె మాట్లాడుతూ ‘ఫైర్.. రామ్ చరణ్ , జాన్వీ కపూర్, దివ్యేన్డు శర్మ, బుచ్చి బాబు సనా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీలాగే నేను కూడా ఈ చిత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. గతం లో వీళ్లిద్దరు కలిసి ‘జంజీర్’ అనే చిత్రంలో నటించారు. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
కానీ అప్పటి నుండే రామ్ చరణ్ తో ప్రియాంక చోప్రా కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ ట్రైలర్ విడుదలైనప్పుడే ప్రియాంక చోప్రా శుభాకాంక్షలు తెలిపి ఉండేది కానీ, ఆమెకు ఈ సినిమా విడుదల అవుతున్న విషయం నేడే తెలిసింది. రామ్ చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడే తన స్టోరీ లో అప్లోడ్ చేసాడు. దీనిని చూసిన ప్రియాంక చోప్రా వెంటనే ఆ చిత్రం గురించి ట్వీట్ వేసింది. ఇకపోతే నేడు ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ సాంగ్ ని భోపాల్ లో ఒక మ్యూజికల్ నైట్ ని నిర్వహించి గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
Fire!
Congratulations @alwaysramcharan @janhvikapoor #DivyennduSharma @BuchiBabuSana and the entire team. Looking forward! https://t.co/zJ2yeAprjr
— PRIYANKA (@priyankachopra) May 21, 2026
