Homeఎంటర్టైన్మెంట్Priyanka : ఆ పని చేసినందుకు పచ్చి బూతులు తిట్టారు, బిగ్ బాస్ ప్రియాంక ఓపెన్...

Priyanka : ఆ పని చేసినందుకు పచ్చి బూతులు తిట్టారు, బిగ్ బాస్ ప్రియాంక ఓపెన్ కామెంట్స్

Priyanka : ప్రియాంక జైన్ సీరియల్ నటిగా ఫేమస్. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ లో ఆమె నటించారు. అలాగే ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఆమెకు బ్రేక్ రాలేదు. బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక జైన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆమె సత్తా చాటింది. ఫైనల్ కి వెళ్ళింది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం పొందింది. గ్రూప్ గేమ్ ఆడిందన్న విమర్శలు ఆమెకు టైటిల్ దూరం చేశాయి. టైటిల్ చేజారినా పాపులారిటీ అయితే పెంచుకుంది.

ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తుంది. ఓ షోలో ప్రియాంక జైన్ గ్లామర్ షోకి తెరలేపింది. నెట్ డ్రెస్ లో క్లివేజ్ షో చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పద్దతిగా ఉండే ప్రియాంక జైన్ ఇలా మారిపోయిందేంటి అని ఆమె అభిమానులు సైతం కంగుతిన్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమె డ్రెస్సింగ్ పై నెగిటివ్ కామెంట్స్ దర్శనమిచ్చాయి. కొందరైతే పచ్చి బూతులు తిట్టారు. ఈ ట్రోలింగ్ ప్రియాంక జైన్ ని వేదనకు గురి చేసిందట. తన బాధను ఆమె ఎట్టకేలకు వెళ్లగక్కింది.

Also Read : బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియ

ప్రియాంక జైన్ మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ విషయంలో ప్రతి ఒక్కరికీ సపరేట్ టేస్ట్ ఉంటుంది. అలాగని డీప్ డ్రెస్సింగ్ లో ఈ అమ్మాయి, సెలబ్రిటీ బయట తిరగాలని ఆశపడదు. మేము కూడా అమ్మాయిలమే, మనుషులమే. ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నన్ను గతంలో ట్రోలింగ్ చేశారు. పద్దతిగా ఉండే అమ్మాయి ఇలా మారిపోయింది ఏంటి అన్నారు. కొన్ని దుస్తుల్లో అప్పుడప్పుడు అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు అవి వర్క్ అవుట్ కాకపోవచ్చు. అంతమాత్రాన తిట్టడం సరికాదు. మీకు నచ్చకపోతే ఫాలో అవ్వకండి.

అన్ ఫాలో కొట్టండి. అంతే కానీ ఇష్టం వచ్చినట్లు బూతు కామెంట్స్ పెట్టడం సరికాదు.. అన్నారు. కాగా ప్రియాంక జైన్ సీరియల్ నటుడు శివ కుమార్ తో చాలా కాలంగా రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి శివ కుమార్ వచ్చాడు. ఆ విధంగా తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది. పెళ్లి కాకుండా కలిసి జీవించడం పై కూడా విమర్శలు వినిపించాయి.

RELATED ARTICLES

Most Popular