Prashanth Neel – NTR : కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ (KGF) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు…ప్రస్తుతం ఆయన తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టడంలో ఆయన కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి డ్రాగన్ (Dragon) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందా? లేదా అనే కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. 200 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టే సినిమా ఇదే అవుతుంది అంటూ ఆయన చాలావరకు కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇతర హీరోలందరికి ఇండస్ట్రీ హిట్ ఉన్నప్పటికి ఎన్టీఆర్ (NTR) కి మాత్రం ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా దక్కలేదు.
ఆయన ఎంటైర్ కెరియర్ లో తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చే సినిమా ఇదే అవుతుంది అంటూ ఆయన చాలా సందర్భాల్లో తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ సినిమా అవుట్ పుట్ ను చూసి చాలా సంబరపడిపోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్ గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులందరికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ఎండింగ్ లో ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రశాంత్ నీల్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఎండింగ్లో ఒక స్టార్ హీరో కనిపించబోతున్నాడట.
ఆ హీరో ప్రభాస్ గారే అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక సినిమా క్లైమాక్స్ లోనే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందంటు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సలార్ సినిమాకి ఈ సినిమాకి మధ్య కూడా సంబంధం ఉండబోతోంది అనే విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. మరి వీటన్నింటికి ఒక క్లారిటీ రావాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…