Manchu Vishnu : హీరో గా, నిర్మాతగా మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అన్ని ఇండస్ట్రీస్ తనకు , తన తండ్రికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చిందని మంచు విష్ణు బలమైన నమ్మకం తో ఉన్నాడు. ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా జూన్ 27 న విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు నెల రోజుల పైనే సమయం ఉన్నప్పటికీ విష్ణు ప్రొమోషన్స్ విషయం లో ఎక్కడా తగ్గడం లేదు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘కన్నప్ప’ చిత్రం గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : నయనతారతో ప్రమోషనల్ వీడియో ఏంటి సామి…అనిల్ రావిపూడి నువ్వు మాములోడివి కదయ్యా..
కన్నప్ప చిత్రం పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ ‘కన్నప్ప సినిమాని ఇంకా ఎవ్వరూ చూడలేదు, ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఈ చిత్రం లోని సన్నివేశాలను తప్పుబడుతూ సెన్సార్ బోర్డు కి లేఖలు రాశారు. అది తెలిసిన తర్వాత వాళ్లకు మన చరిత్ర గురించి అవగాహన లేదని నాకు స్పష్టంగా అర్థమైంది. రీసెంట్ గానే శ్రీ కాళహస్తి అర్చకులకు కన్నప్ప చిత్రాన్ని చూపించాం. సినిమాలో ఏమైనా మార్చమంటే చెప్పండి మార్చేస్తాము అని చెప్పాము. వాళ్ళు చూసిన తర్వాత ఒక్కటంటే ఒక్క షాట్ కూడా మార్చాల్సిన అవసరం లేదు, అంతా కరెక్ట్ గా ఉందని చెప్పారు. నిజమైన భక్తి కి నిర్వచనం ఏంటో ఈ చిత్రం ద్వారా చూపించారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ప్రారంభానికి ముందు ఒక బడ్జెట్ అనుకున్నామని, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యిందని మంచు విష్ణు వ్యాఖ్యానించాడు.
ప్రభాస్(Rebel Star Prabhas) గురించి మాట్లాడుతూ ‘ప్రభాస్ నాకు ప్రాణ మిత్రుడు. అతను ఒక మహానటుడు, ఈ విషయం అతనికి కూడా తెలియదు. కెరీర్ ప్రారంభం లో స్టార్ స్టేటస్ ఉండదు కాబట్టి అందరూ చాలా సాధారణంగా ఉంటారు. కానీ ప్రభాస్ నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యాక కూడా అలాగే ఉన్నాడు. 20 ఏళ్ళ క్రితం ప్రభాస్ నాకు పరిచయమైనప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఆయన లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మేము ఎప్పటికీ సోదరులం లాగానే ఉంటాను. నా రక్తం పంచుకొని పుట్టిన సోదరుడే నా పతనం కోరుకుంటున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం నాకోసం ఏమి ఆశించకుండా, నేను సక్సెస్ అవ్వాలని ఈ సినిమా చేసాడు. అందుకే అతనికి ఎన్ని జన్మలైనా రుణపడి ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.