Pawan Kalyan: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాభివృద్ధికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ 50 లక్షలు అందజేశారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఇటీవల పంటకుంట నిర్మాణాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కలిసి కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఆయన తన ఇంటి పేరు కలిగిన గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా రూ. 50 లక్షలు మంజూరు చేశారు.