Prakash Raj : తమకంటే పెద్ద నటులకు తండ్రిగా, అన్నయ్యగా, అమ్మగా, వదిన, అక్కగా చేయడం వెరీ కామన్. ఇది చాలా కాలంగా జరుగుతుంది. ఎన్టీఆర్,ఏఎన్నార్ ల కంటే వయసులో చిన్నవాడైన గుమ్మడి వారికి తండ్రిగా పదుల సంఖ్యలో చేశారు. అంజలి మొదట్లో ఎన్టీఆర్ కి జంటగా నటించారు. తర్వాత ఆయన తల్లి పాత్రల్లో కనిపించారు. చెప్పుకుంటూ పోతే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇక ఈ జెనరేషన్ లో తండ్రి పాత్రలకు ప్రకాష్ రాజ్ బాగా ఫేమస్. అప్ కోర్స్ ఆయన అన్ని రకాల పాత్రలు చేశారు. టాలెంటెడ్ యాక్టర్ గా కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్… ఇలా అన్ని పాత్రలు చేశారు.