Ram Charan : సౌత్ ఇండియా లో మంచి క్రేజ్ ఉన్న తెలుగు అమ్మాయిలలో ఒకరు అంజలి(Actress Anjali). ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళం లోనే మొదట కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో అనేక సినిమాలు చేసింది. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఈమెకు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అనేక సినిమాలు చేసింది, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈమె క్యాలిబర్ కి క్యారెక్టర్స్ పడలేదని అందరూ అనుకుంటూ ఉంటారు. రీసెంట్ గానే ఆమె రామ్ చరణ్(Global Star Ram Charan), శంకర్(Shankar Shanmugham) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటించింది. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ తో సమానంగా యాక్టింగ్ అదరగొట్టేసింది. అంజలి లో ఇంత క్యాలిబర్ ఉందా అని ఈ సినిమాలోని క్యారక్టర్ ని చూసి అందరూ మాట్లాడుకున్నారు.
Also Read : ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై రామ్ చరణ్ అమ్మమ్మ..!
ఇకపోతే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే అంజలి, రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ ఫోటోలలో ఆమె బేబీ బంప్ తో ఉన్నట్టుగా అనిపించింది. ఆమెకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. అయినప్పటికీ బేబీ బంప్ ఎలా వస్తుంది అని అందరూ అనుకున్నారు. ఆమె డ్రెస్సింగ్ కారణంగా అలా అనిపిస్తుండొచ్చు కానీ, చూసేందుకు ఆ ఫోటోలు కాస్త తేడాగానే ఉన్నాయి. ఈ ఫోటో క్రింద కామెంట్స్ లో నెటిజెన్స్ కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసారు. అంజలి చూసేందుకు లావు గా, బొద్దుగా ఉంటుంది కాబట్టి, ఆమె శరీర తత్వానికి తగ్గ కాస్ట్యూమ్ వేసుకోలేదు కాబట్టి అందరికీ అలా అనిపించి ఉండొచ్చు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి దీనికి అంజలి నుండి ఎలాంటి రియాక్షన్ అయినా ఉంటుందా లేదా అనేది.
ఇకపోతే అంజలి చేతిలో ప్రస్తుతం ‘ఈగై’ అనే తమిళ సినిమా మాత్రమే ఉంది. ఈ చిత్రం తర్వాత ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కానీ, తమిళ సినిమా కానీ లేదు. పలు వెబ్ సిరీస్ చేయడానికి అంగీకారం తెలిపింది కానీ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఆమె నటించిన రెండు సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల అయ్యాయి. అందులో ఒకటి గేమ్ చేంజర్ అనే సంగతి తెలిసిందే. ఇంకోటి 15 ఏళ్ళ క్రితం హీరో విశాల్ తో చేసిన ‘మధ గజ రాజా’ అనే చిత్రం. ఈ రెండు సినిమాల్లో ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అవ్వగా, మధ గజ రాజా చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలా ఒక హిట్టు, ఒక ఫ్లాప్ అన్నట్టుగా ఆమె కెరీర్ కొనసాగుతుంది.
Also Read : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ గ్లింప్స్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!