https://oktelugu.com/

Jagapathi Babu: ప్రభాస్ దెబ్బకి స్పృహ కోల్పోయిన జగపతి బాబు..వైరల్ అవుతున్న జగపతి బాబు లేటెస్ట్ వీడియో!

ప్రభాస్ కి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళలో ఒకరు జగపతి బాబు. ఈయనకి కూడా రీసెంట్ గా ఒక పెద్ద క్యారేజ్ తన ఇంటి నుండి పంపించాడట ప్రభాస్. దీనిని సోషల్ మీడియా లో జగపతి బాబు షేర్ చేస్తూ 'వివాహ భోజనంబు..ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 10, 2024 / 01:26 PM IST

    Jagapathi Babu

    Follow us on

    Jagapathi Babu: ఇండస్ట్రీ లో రెబల్ స్టార్ ప్రభాస్ అందరితో ఎంతో సన్నిహితంగా ప్రేమగా ఉంటాడో అందరికీ తెలిసిందే. చూసేందుకు బాహుబలి లాగా కనిపిస్తాడు, కానీ ఆయన మనస్సు మాత్రం వెన్న. ఇతనితో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే హీరోలు కూడా ఆయన వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతారు. అయితే ఒకప్పుడు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ఎవరైనా తన ఇంటికి వచ్చినప్పుడు కడుపునిండా భోజనం పెట్టి పంపేవారట. శత్రువులైనా సరే ఇంటికి వచ్చినప్పుడు భోజనం తినిపించడం ఆయనలో ఉన్న గొప్ప గుణం. ప్రభాస్ కి కూడా ఆ గుణం అలవాటైంది. ఆయన షూటింగ్ కి వచిఅనప్పుడల్లా మూవీ టీం మొత్తానికి తన ఇంట్లో తయారు చేయించిన వంటకాలను తినిపించడం అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా తనకి బాగా దగ్గరైన వాళ్లకు ప్రభాస్ పొట్ట పగిలేలా పది రకాల వంటకాలను తినిపిస్తాడు. ఈ విషయాన్నీ ఎంతో మంది సెలెబ్రిటీలు ఇంటర్వ్యూస్ లో చెప్పడం మనమంతా చూసాము.

    ప్రభాస్ కి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళలో ఒకరు జగపతి బాబు. ఈయనకి కూడా రీసెంట్ గా ఒక పెద్ద క్యారేజ్ తన ఇంటి నుండి పంపించాడట ప్రభాస్. దీనిని సోషల్ మీడియా లో జగపతి బాబు షేర్ చేస్తూ ‘వివాహ భోజనంబు..ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగింది. ఎవరికీ చెప్పొద్దు. చెప్తే ఇంకా ఆయన పెట్టే ఫుడ్ కి ఈ బాబు బలి..అదే బాహుబలి లెవెల్..దున్నపోతులాగా తినేసి ఆంబోతు లాగా నిద్రపోయాను’ అని చెప్పుకొచ్చాడు జగపతి బాబు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సలార్, రాధే శ్యామ్ చిత్రాలు వచ్చాయి. రాధే శ్యామ్ చిత్రం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సన్నివేశాలు ఉన్నాయి కానీ, సలార్ లో మాత్రం లేవు. అయితే జగపతి బాబు చెప్పిన వీడియో ని బట్టీ చూస్తే ఆయన ‘సలార్ 2’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.

    ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘సలార్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాదు, ఓటీటీ లో కూడా సెన్సేషనల్ హిట్. నెట్ ఫ్లిక్స్ లో అనుకున్న రేంజ్ రెస్పాన్స్ రాలేదు కానీ, హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ దాదాపుగా ఏడాది నుండి ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ స్థాయి బాలీవుడ్ రీచ్ ఈమధ్య కాలం లో ఏ సినిమాకి కూడా రాలేదు. బాలీవుడ్ లో అసలే సీక్వెల్స్ కి యమక్రేజ్ ఉంది. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రేపు ‘సలార్ 2’ పుష్ప కి మించి పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు మేకర్స్.