Zodiac Signs: 30 ఏళ్ల తరువాత కలుస్తున్న ఈ గ్రహాలు.. దీంతో ఈ రెండు రాశుల వారి పంట పండినట్లే..మార్గశిర మాసంలో శని గ్రహం, శుక్రుడు కలవనున్నారు. శని అంటే చాలా మందికి భయం. ఆయన తమ జీవితంలో ఉంటే ఎన్నో కష్టాలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ శనీశ్వరుడు ఎవరినీ కావాలని నష్టపోయే విధంగా చేయడు. ఒక వ్యక్తిని సక్రమమైన మార్గంలో నడిచే విధంగా చేస్తాడు. అలాగే నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత చల్లని గ్రహం. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే ఆయా రాశుల వారికి పంట పండినట్లే. అయితే ఈనెలలో శుక్రుడు, శని గ్రహాలు కలవనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తరువాత శుక్రుడు, శని కలుస్తున్నాయి. సంతోషాన్ని మాత్రమే పంచిపెట్టే శుక్రుడు, తప్పు చేస్తే శిక్షించే శని కలయికతో కొన్ని రాశుల వారి జీవితాలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోన్నాయి. ఆ రాశులు ఏవంటే?
శుక్రుడు, శని కలయిక వల్ల అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని రాశుల వారికి మాత్రం పంట పండినట్లే అవుతుంది. అలాంటి రాశుల్లో మిథునం ఒకటి. రెండు గ్రహాల కలయికతో ఈ రాశి వారి జీవితమే మారిపోనుంది. అనుకోకుండా కొన్ని ఆర్థిక వనరులు చేకూరుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు చిక్కుతాయి. ఇంట్లో ధనలక్ష్మీ సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల కొత్త ఆదాయ వనరుల కోసం సెర్చ్ చేయగా.. అవి విజయవంతం అవుతాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి వారికి శని, శుక్ర గ్రహం కలయిక ప్రభావం ఉండనుంది. ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారి కల నెరవేరుతుంది.ఇప్పటికే మొదలుపెట్టి పెండింగ్ లో ఉన్న పనులు మళ్లీ పుంజుకుంటాయి. జీవిత భాగస్వామిత సపోర్టుతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని చేసిన ఇన్వెస్ట్ మెంట్ లాభాలను తెచ్చిపెడుతుంది.
అయితే మిగతా రాశి వారికి అనుకూలం లేదని చెప్పలేం. కానీ వారు కూడా తమ జీవితాల్లో సంతోషాలను నెలకొల్పాలంటే కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం శని కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు ఇదే రాశిలో కొనసాగుతాడు. ఈ కారణంగా పైన రెండు కాకుండా మిగతా రాశులపై కొంత ప్రభావం ఉంటుంది. దీంతో ఆ రాశుల వారు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతీ శనివారం నవగ్రాహల పూజ చేసేందుకు ప్రయత్నించాలి. మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాల్లోనూ శని పూజలు నిర్వహించడం వల్ల ఆ స్వామి ఆనుగ్రహం ఉంటుంది.