https://oktelugu.com/

Movies : పెద్ద సినిమాల టిక్కెట్ రేట్ పెంచడం వల్ల ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి…

సినిమా అనేది ప్రతి ఒక్కరికి వినోదాన్ని అందించే మాధ్యమమనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ప్రేక్షకులు సినిమాలను ఒకప్పుడు చాలా తక్కువ రేటుకే వీక్షించేవారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 01:27 PM IST

    movies

    Follow us on

    Movies : సినిమా అనేది ప్రతి ఒక్కరికి వినోదాన్ని అందించే మాధ్యమమనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ప్రేక్షకులు సినిమాలను ఒకప్పుడు చాలా తక్కువ రేటుకే వీక్షించేవారు. కానీ ఇప్పుడు ఆ రేట్లు భారీగా పెరిగిపోతున్న కారణంగా సగటు ప్రేక్షకులు తన ఫ్యామిలీతో సినిమా చూడాలి అంటే మాత్రం ఈ రోజుల్లో చూసే ప్రసక్తైతే లేదు అనెంతలా టికెట్ రేట్లను పెంచేస్తున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతున్న సందర్భంలో ప్రస్తుతం భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఈ సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా సినిమా టిక్కెట్ల మీద రేట్లు కూడా పెంచుతున్నారు. ఇక ఇప్పటికే ఓటిటిలో సినిమాలు చూడడానికి బాగా అలవాటు పడిన జనాలు థియేటర్ కి రావడమే కష్టతరం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు టిక్కెట్ల రేటు పెంచడం వల్ల వాళ్లు ఇక సినిమా థియేటర్ కి రావాలనుకునే నిర్ణయాన్ని కూడా మార్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి పెద్ద సినిమాలను భారీ బడ్జెట్ తో తీస్తున్నప్పుడు ఈ మాత్రం టికెట్ రేట్లు పెంచకపోతే వాళ్లకు గిట్టుబాటు కాదనే ఉద్దేశ్యంలో ప్రొడ్యూసర్లు అయితే ఆలోచిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలను చేయాల్సిన అవసరం ఏముంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం సక్సెస్ లనేవి చాలా కీలక పాత్రను వహిస్తాయి. కాబట్టి భారీ రికార్డులను కొల్లగొట్టే నేపథ్యంలో కూడా చాలామంది వాళ్ళ సినిమాలకు ప్రస్తుతం ఉన్న రేటు కంటే డబుల్ త్రిబుల్ రేట్లు పెట్టి అమ్మడంతో కలెక్షన్స్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న సినిమాలన్నీ భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి.

    కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో సినిమాలన్నీ కూడా ఎక్కడ రాజీ పడకుండా భారీ కలెక్షన్స్ ను సంపాదించి పెడుతున్నాయనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో చిన్న సినిమాలకు చాలా వరకు అన్యాయం జరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇలాంటి క్రమంలోనే టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల పెద్ద సినిమాలు బాగానే ఉంటాన్నాయి కానీ చిన్న సినిమాలు భారీగా నష్టపోతున్నాయి. కాబట్టి ఇక మీదట వచ్చే సినిమాల విషయంలో టిక్కెట్ రేట్లను పెంచే అవకాశం లేదంటూ కొంతమంది కరాకండిగా చెప్పేస్తున్నారు. తద్వారా పెద్ద సినిమాల కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఆ సినిమా కి పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందా లేదా అనే నేపథ్యంలో ప్రొడ్యూసర్లు ఆలోచిస్తున్నారు…

    ఇక ఏది ఏమైన కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు కూడా వాళ్ల రెమ్యూనరేషన్ ను కొంతవరకు తగ్గించుకుంటే మంచింది అని కొంత మంది ట్రెడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…