Prabhas : ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) చేస్తున్న చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie). వరుస ఫ్లాప్స్ లో ఉన్న మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కోట్ల రూపాయిల నష్టాలను చవిచూసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తోంది. అన్ని ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే, ఈ చిత్రం వచ్చే నెల 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చేది. టాకీ పార్ట్ 80 శాతం కి పైగా పూర్తి అయ్యింది కానీ, VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందట. అంతే కాకుండా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వరకు మిగిలిపోయిందట. దీంతో ఏప్రిల్ లో కాకపోయినా, సెప్టెంబర్ లో అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలేలా ఉంది.
Also Read : రెబల్ స్టార్ ప్రభాస్ కి తగిలిన గాయాలపై స్పందించిన టీం..కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ వార్నింగ్!
ఎందుకంటే రీసెంట్ గానే ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన ఔట్పుట్ ని చూసి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసాడట. గ్రాఫిక్స్ వర్క్ పై ఆయన డైరెక్టర్, నిర్మాతలపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎదో చిన్న సినిమాకి డిజైన్ చేసినట్టు ఉన్నాయట గ్రాఫిక్స్ వర్క్. ఇంత చెత్త క్వాలిటీ తో రిలీజ్ చేస్తే అభిమానులు కొడతారని, ఆలస్యం అయినా పర్వాలేదు, గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయాల్సిందే అని, ప్రభాస్ చాలా గట్టిగా అంటున్నాడట. దీంతో 80 శాతం పూర్తి అయిన గ్రాఫిక్స్ వర్క్ పై రీ వర్క్ చేసేందుకు సిద్ధం అవుతుంది మూవీ టీం. దీనిని బట్టి అర్థం అవుతుంది ఏమిటంటే, ఈ చిత్రం ఈ ఏడాది విడుదల అవ్వడం కష్టమే అని. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న రేంజ్ కి చేరుకునే వరకు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి వీలు లేదని ప్రభాస్ మేకర్స్ తో అన్నాడట.
దీంతో ఈ సినిమా కంటే ముందు, ప్రభాస్ ఇటీవలే హను రాఘవపూడి(Hanu Raghavapudi) తో మొదలు పెట్టిన పాన్ ఇండియన్ లవ్ స్టోరీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇదే స్పీడ్ లో ముందుకు పోతే, డిసెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయట. ఔట్పుట్ కూడా ఇప్పటి వరకు తీసినది చాలా బాగా వచ్చిందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా విడుదల చేస్తూ వచ్చిన ప్రభాస్, ఈసారి కేవలం ఒక్క సినిమాతోనే సరిపెట్టాల్సి వచ్చేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ఫోకస్ మొత్తం సందీప్ వంగ ‘స్పిరిట్’ వైపు షిఫ్ట్ అవ్వనుంది.
Also Read : ప్రభాస్ కి ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు… అసలు విషయం లీక్ చేసిన హీరోయిన్!