Prabhas : ప్రభాస్ వివాదరహితుడు. కూల్ గా ఉంటారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇష్టపడతారు. అయితే ప్రభాస్ కి సంబంధించిన చాలా విషయాలు గోప్యంగానే ఉండిపోయాయి. ముఖ్యంగా పెళ్లి మేటర్. దీనిపై ప్రభాస్ ఎప్పుడూ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఆయనకు పెళ్లి ఆలోచన ఉందా లేదా అనే విషయం తెలియదు. ఫార్టీ ప్లస్ లో ఉన్న రెబల్ స్టార్ ఇకపై వివాహం చేసుకోరేమో అనే సందేహాలు ఉన్నాయి. ఇటీవల మంచు లక్ష్మి… 2025లోనే ప్రభాస్ పెళ్లి అంటూ ఓ కామెంట్ చేసింది. దేని ఆధారంగా మంచు లక్ష్మి అలా స్పష్టత ఇచ్చారో తెలియదు.
ఇదిలా ఉండగా ప్రభాస్ ది భోళా గుణం. తన మూవీ సెట్స్ లో పని చేసే ప్రతి ఒక్కరు మంచి, రుచికరమైన భోజనం చేయాలని ఆయన కోరుకుంటాడు. ఇక తనతో జతకట్టే హీరోయిన్స్ కి, ప్రధాన నటులకు అరుదైన నాన్ వెజ్ వంటకాలతో విందు ఏర్పాటు చేస్తారు. ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న పలువురు హీరోయిన్స్ కి అద్భుతమైన ఆతిథ్యం దక్కింది. ప్రభాస్ వద్ద ఒక చెఫ్ టీమ్ ఉంటుంది. ఆయన ఆహార ప్రియుడు అనే వాదన ఉంది.
Also Read : అనుష్క ఆ హీరోతో ఏడాది కలిసుంది, వివాదాస్పదంగా సీనియర్ దర్శకుడి కామెంట్స్, ప్రభాస్ తో గొడవలు అందుకే అంటూ!
అయితే ప్రభాస్ తినరు.. ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం, తినిపించడం ఆయనకు చాలా ఇష్టం అట. ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ లో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ అయిన శ్రీదేవి ఈశ్వర్ మూవీతో హీరోయిన్ గా మారింది. అప్పట్లోనే శ్రీదేవికి ప్రభాస్ తన వంటకాల రుచి చూపాడట. ప్రభాస్ కి ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు. ఎప్పటి నుండో ఉంది. ఆయన వంటల గురించి చెబుతుంటే అలానే వింటూ ఉండిపోతాము. నాకు కూడా నాన్ వెజ్ అంటే ఇష్టం. ప్రభాస్ కి తినడం కంటే కూడా ఇతరులకు తినిపించడానికి ఇష్టపడతారు.. అని చెప్పుకొచ్చింది.
తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తెనే శ్రీదేవి. ఇటీవల కామెడీ స్టార్స్ షోకి జడ్జిగా కూడా ఆమె వ్యవహరించారు. ఈశ్వర్ మూవీ అనంతరం శ్రీదేవి నిన్నే ఇష్టపడ్డాను, అన్వేషణ, ఆదిలక్ష్మి, పెళ్లి కాని ప్రసాద్ వంటి చిత్రాల్లో నటించింది. ఆమెకు బ్రేక్ రాలేదు. ప్రభాస్ తో ఒకప్పటి అనుభవాలను శ్రీదేవి పంచుకున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్క్రీన్ నేమ్ టైటిల్ తో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా..మండిపడుతున్న ఫ్యాన్స్