https://oktelugu.com/

Prabhas : వేల సంబంధాలు వచ్చిన ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?

Prabhas : ఇండియా వైడ్ గా సెలబ్రిటీస్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మిగిలిన హీరోల లిస్ట్ తీస్తే ముందు సల్మాన్ ఖాన్(Salman Khan) ఉంటాడు, ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఉంటాడు.

Written By: , Updated On : March 26, 2025 / 02:27 PM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas : ఇండియా వైడ్ గా సెలబ్రిటీస్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మిగిలిన హీరోల లిస్ట్ తీస్తే ముందు సల్మాన్ ఖాన్(Salman Khan) ఉంటాడు, ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఉంటాడు. ప్రస్తుతం ప్రభాస్ కి 45 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటి వరకు ఆయన పెళ్లి ఊసే ఎత్తడం లేదు, ప్రతీ ఏడాది ఈసారి కచ్చితంగా చేసుకుంటాను అని అంటున్నాడే కానీ, పెళ్లి మాత్రం జరగడం లేదు. కృష్ణం రాజు బ్రతికి ఉన్నన్ని రోజులు ప్రభాస్ పెళ్లి గురించి దిగులు చెందుతూనే ఉండేవాడట. ఎవరైనా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అడిగితే కోపం తెచ్చుకునే వాడు. సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, బిజీ గా ఉన్నాడు, ఖాళీ దొరికినప్పుడు చేసుకుంటాడు అని కవర్ చేసేవాడు. గతంలో ప్రభాస్ ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గట్టిగా వినిపించాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చెప్పుకొచ్చేవారు.

Also Read : ప్రభాస్ తో ఆ దర్శకుడికి సినిమా చేయడం రాదు…అందుకే ఇలా చేస్తున్నాడా..?

అనుష్క కూడా ప్రభాస్ తన ఇంట్లో కుటుంబం తో కలిసి జరుపుకునే ప్రతీ వేడుకలో అనుష్క ఉండడంతో కచ్చితంగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారేమో అని అనుకున్నారు. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ సమయంలో హీరోయిన్ కృతి సనన్ తో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. అందులో కూడా ఎలాంటి నిజం లేదంటూ హీరోయిన్ కృతి సనన్(Krithi Sanon) సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా మొగళ్తూరు కి చెందిన అమ్మాయితోనే పెళ్లి ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాది మొదలై అప్పుడే మూడు నెలలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్ళికి సంబంధించి ఎలాంటి ఊసు లేదు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పెళ్లి గురించి మరో ఆసక్తికరమైన వార్త వచ్చింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి వేల సంఖ్యలో పెళ్లి సంబంధాలు వచ్చాయట. 5000 మంది అమ్మాయిలు డైరెక్ట్ గా ప్రపోజ్ చేశారట.

అయితే, ప్రభాస్ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి, బాహుబలి 2 కంప్లీట్ చేశాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని అంతా ఆశగా ఎదురుచూశారు. కానీ డార్లింగ్ ఎలాంటి స్వీట్ చెప్పలేదు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ కు వేల్లల్లో పెళ్లి సంబంధాలు వచ్చాయంట.ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వెళ్లడంతో ఏకంగా డార్లింగ్ తో పెళ్లికి సిద్ధమంటూ 5000 మంది మ్యారేజ్ ప్రపోజల్స్ పంపించారంట. అందులో కొంతమంది టాప్ హీరోయిన్స్ ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న పారిశ్రామిక వేత్తల కూతుర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు?, అసలు ఆయనకు పెళ్లి అంటే ఇష్టం ఉందా లేదా అని అంటున్నారు అభిమానులు.

Also Read : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి అందాల బ్యూటీ…