Prabhas: బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆయన సినిమా వస్తుందంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నాడు, తెలుగు సినిమా నేటివిటీ కి తగ్గ చిత్రాలు చెయ్యడం లేదని ఫ్యాన్స్ నుండి ఒక చిన్న కంప్లైంట్ ఉంది.
అందుకే యంగ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా డీలక్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది, ఫ్యాన్స్ మాత్రం ఈ చిత్రం పై చాలా నిరాశతో ఉన్నారు. ఎందుకంటే మారుతీ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు, అలాంటి డైరెక్టర్ తో ఏ స్టార్ కూడా సినిమాలు చెయ్యడు, అలాంటిది ప్రభాస్ ఎలా చేస్తున్నాడు అని అప్పట్లో ఫ్యాన్స్ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున నెగటివ్ ట్రెండ్ కూడా చేసారు.
అది కాసేపు పక్కన పెడితే మరో చిన్న లేడీ డైరెక్టర్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం అవుతుందట. ఆమె మరెవరో కాదు నందినీ రెడ్డి. ఆమె దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ ఈ వారం లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
ప్రభాస్ ప్రాజెక్ట్ K చిత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందనే నమ్మకం ఉంది, అంత గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ప్రభాస్ కోసం నా దగ్గర డార్లింగ్ రేంజ్ లవ్ స్టోరీ సిద్ధం గా ఉందని , ఒక్కసారి ప్రభాస్ ఛాన్స్ ఇస్తే కలిసి కథ చెప్తానని చెప్పుకొచ్చింది.మరి ప్రభాస్ మారుతికి ఇచ్చినట్టే నందిని రెడ్డి కి కూడా ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాకి టైటిల్ కూడా ‘రామ్’ అని ఫిక్స్ చేసినట్టు సమాచారం.