Sreeleela: రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా శ్రీలీల క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న హీరోల దగ్గర నుండి సూపర్ స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరికి తమ సినిమాలలో హీరోయిన్ గా ఇప్పుడు శ్రీ లీలనే కావాలి, ఆ రేంజ్ లో ఆమె డిమాండ్ ని ఏర్పర్చుకుంది.
ఈమె వేసే డ్యాన్స్ కి అలాంటి క్రేజ్ ఉంది మరి.కేవలం ఈమె డ్యాన్స్ కోసమే థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ఉన్నారు, అందుకే నిర్మాతలు ఈమె ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధం ఐపోతున్నారు. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాతో పాటుగా, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం లోను నటిస్తుంది. వీటితో పాటు ఆమె చేతినిండా మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా శ్రీలీల క్రేజ్ ని చిన్న సినిమాల దర్శక నిర్మాతలు కూడా తెగ వాడేసుకుంటున్నారు. ఈమెని కలిసి ప్రత్యేకంగా ఆమె చేత వీడియో బైట్స్ ఇప్పించుకుంటున్నారు. రీసెంట్ గా ఈమె గోపీచంద్ రామబాణం, అల్లరి నరేష్ ఉగ్రం మరియు రీసెంట్ గా నందిని రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రానికి కూడా వీడియో బైట్ ఇచ్చింది.
హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఆమె డ్యాన్స్ చేస్తూ పెట్టిన ఒక వీడియో కి సోషల్ మీడియా లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇలా ఆమె క్రేజ్ ని ఉపయోగించుకొని ఈ రేంజ్ లో తమ సినిమాలకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు చిన్న సినిమాల దర్శక నిర్మాతలు.ఇండస్ట్రీ కి వచ్చిన రెండేళ్ల లోపే ఆమె రేంజ్ ఇలా మారిపోవడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.