Inspire Story: జీవితంలో కొన్ని విషయాల్లో గెలవడం సాధ్యం కావొచ్చు.. కానీ జీవితానికి ఎదురొడ్డి నిలవడం కొందరికే సాధ్యమవుతుంది.. ఎన్ని కష్టాలు వచ్చినా.. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లిన వారే నిజమైన విజేతలుగా కీర్తిస్తారు. ఈరోజుల్లో చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి ప్రాణాలు తీసుకునేవారు ఎందరో ఉన్నారు. కానీ ఓ యువతి తన స్థాయికి మించిన కష్టాలను దాటుకుంటూ గమ్యాన్ని చేరుకుంది. ఎన్నో అవమానాలు, బాధలు భరించుకుంటూ సక్సెస్ వైపుగా దూసుకెళ్లింది. ఆమె చేసిన తప్పల్లా తన కన్నా తక్కువ కులం ఉన్న అబ్బాయిని ప్రేమించడమే. దీంతో ఆమె తల్లిదండ్రుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఆమె చేసిన పనికి తల్లిదండ్రులే మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ యువతి కథేంటి?
హైదరాబాద్ లోని 17 ఏళ్ల వయసున్న ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమించింది. ఈరోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు కామన్. కానీ అమ్మాయి తల్లిదండ్రులు పట్టుదలతో ఉన్న మనుషులు. దీంతో తమ అమ్మాయి ప్రేమను వారు అంగీకరించలేదు. అంతేకాకుండా వీరి పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ తన ప్రేమ నిజమైందని ఆ అమ్మయి ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది. అయితే తమకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయి మైనర్ కావడంతో నిబంధనల ప్రకారం పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే మైనారిటీ తీరే వరకు ఆమెను బాలికల గృహంలో ఉంచారు.
పెళ్లి చేసుకున్న మాత్రాన తమ జీవితానికి పులిస్టాఫ్ పడిందని ఆ అమ్మాయి అనుకోలేదు. వెంటనే కెరీర్ పై దృష్టి పెట్టింది. గణిత శాస్త్ర ప్రొఫెసర్ కావాలన్న ఆశతో ముందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఇంటర్మీడియట్ చదువుతోంది. దీంతో బాగా చదివిని ఆమె ఇంటర్ లో 945 మార్కులను తెచ్చుకుంది. కల్లం అంజిరెడ్డి వోకేషనల్ జూనియర్ కళాశాలలోనే టాపర్ గా నిలిచింది. తాను పెళ్లి చేసుకున్న సమయంలో తనతో కలిసి బాలికల గృహంలో ఉంటున్నవారు పదో తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు. ఎటువంటి సపోర్టు లేకుండానే వాళ్లు అలా చదవడంపై తనకూ ఆసక్తి కలిగిందని ఈ సందర్భంగా ఆ యువతి మీడియాకు తెలిపింది.

అయితే ఆమెకు వచ్చిన మార్కులను చూసి కొందరు అధ్యాపకులు ఆమెకు పలు సూచనలు చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ వారు ఉన్నత చదువులకు సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే జేఈఈ, నీట్ లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని విజయం వైపు పరుగెత్తుతున్న ఆమె పట్టుదల చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆమె పదో తరగతిలోనూ 10 జీపీ సాధించింది. అయితే తాను తన భాగస్వామితో విడిపోతాననే భయంతో కొన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు గణిత ప్రొఫెసర్ కావాలని ఉంది. అలాగని నా భర్తను విడిచి దూరం వెళ్లి చదువుకోవాలని లేదు.నా భర్తతో ఉంటూనే విజయం సాధించాలని అనుకుంటున్నాను. మాకు పెళ్లయిన కొత్తలో తల్లిదండ్రుల నుంచి భయం ఉండేది. కానీ ఇంటర్లో నాకు వచ్చిన మార్కులు చూసి వారు చాలా ఆనందపడ్డారు. అయితే వీలైనంత తొందర్లోనే నేను అనుకున్నది సాధించి వారి పేరు నిలబెడుతా’ అని ఆమె మీడియాకు చెప్పారు.