Prabhas : రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు…తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద క్లారిటీ అయితే లేకుండా పోతుంది. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నప్పటికి సినిమా మాత్రం పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ప్రభాస్ అభిమాని ఒకతను ఎక్స్ వేదికగా మారుతిని ట్యాగ్ చేస్తూ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన పర్లేదు సినిమా డేట్ మాత్రం రిలీజ్ చేయండి అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇక దానికి రీ ట్వీట్ చేస్తూ మారుతి తొందర్లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అప్పటివరకు కొంచెం వెయిట్ చేయండి అంటూ రీట్వీట్ పెట్టడం విశేషం… మరి రాజాసాబ్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది? ఎందుకని ఈ సినిమాని పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు చేస్తున్నారు అంటూ మరికొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి వస్తున్న సినిమాలు భారీ విజయాలను అందుకోవాలంటే మాత్రం వాటిలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉండాలి. అలా ఉంటే సినిమా ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తుంది.
Also Read : ప్రశాంత్ వర్మ కావాలనే స్టార్ హీరోలకు స్టోరీ చెబుతున్నాడా..?
అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి మారుతి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు. తద్వారా ఆయన సినీ కెరియర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసుకునే మారుతి ప్రభాస్ తో చేస్తున్న రాజాసాబ్ సినిమా వల్ల గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా మీదనే ఆయన పూర్తి ఎఫర్ట్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాతో మారుతికి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు లభిస్తుందనే ధోరణిలో ఆయన ఆలోచనలైతే చేస్తున్నాడు. మరి ఈ సినిమా సక్సెస్ అయితే పర్లేదు.
ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మాత్రం మారుతి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తాడా? ఇక తన మార్కెట్ కూడా చాలావరకు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా పెట్టిన బడ్జెట్ ను రాబట్టే ఒకే ఒక్క హీరో…