Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి. కొంతమంది హీరోలు మాత్రం స్టార్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… దర్శకులు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటూ భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ హీరో ప్రస్తుతం భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. బాహుబలి 2 (Bahubali 2) సినిమాతో 1800 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన ఆయన తన తదుపరి సినిమాతో కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడటమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక దాంతో ప్రొడ్యూసర్లు సైతం ప్రభాస్ సినిమా కోసం ఎన్ని వందల కోట్లయినా సరే పెట్టడానికి రెడీగా ఉంటున్నారు. అందువల్ల ఆయన సినిమాకి ప్రేక్షకుల్లో భారీ హైప్ రావడమే కాకుండా పెట్టిన బడ్జెట్ మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగే కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క హీరో ప్రభాస్ అని కూడా చెబుతూ ఉండటం విశేషం… బాహుబలి తర్వాత నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్లకు పెట్టిన పెట్టుబడులను మాత్రం రాబడుతున్నాయి. అందువల్లే ప్రభాస్ తో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ హిట్ అయితే దక్కుతుందని ఒకవేళ ఫ్లాప్ వచ్చినా కూడా పెట్టిన బడ్జెట్ అయితే ఎటు పోదనే ఉద్దేశ్యంతోనే అతనితో చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : అనుష్క కి తప్ప..తనతో నటించే హీరోయిన్స్ కి ప్రభాస్ కఠినమైన రూల్స్!
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక రేంజ్ లో ఉంటే ఇకమీదట నుంచి చేయబోతున్న సినిమాలు మరొక రేంజ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెచ్చుకోనటువంటి ఒక గొప్ప గుర్తింపును ప్రభాస్ తెచ్చుకున్నాడు.
అందువల్లే ఆయన సినిమాలను చూడడానికి ప్రేక్షకులు చాలా వరకు ఆసక్తి చూపించడమే కాకుండా సినిమా బాగుంటే రిపీటెడ్ గా చూస్తూ సినిమాకి భారీ కలెక్షన్స్ ని అందించే ప్రయత్నమైతే చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడున్న స్టార్ ప్రొడ్యూసర్లందరూ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక మీదట కూడా మరికొన్ని ప్రాజెక్టులు కన్ఫామ్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు…ఇక ప్రభాస్ తో మిగిలిన భాషల డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…
Also Read : ప్రభాస్ ఖాతాలోకి చేరనున్న మరో స్టార్ డైరెక్టర్..?