Homeఆధ్యాత్మికంToday Horoscope In Telugu: నవ పంచమియోగంతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు.. వద్దన్నా...

Today Horoscope In Telugu: నవ పంచమియోగంతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు.. వద్దన్నా ఆదాయం..

Today Horoscope In Telugu: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పూర్వా పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు నవపంచమి యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కొందరి వ్యాపారులకు ఊహించని కంటే ఎక్కువ లాభాలు ఉండనున్నాయి. మరికొందరు జీవిత భాగస్వామితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామిపై కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో సమ్మేవనం పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు జరగనున్నాయి. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. గత నుంచి చేసే ప్రయత్నాలు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి తో వాగ్వాదం ఉంటుంది. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రియమైన వారితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల వద్ద సలహా తీసుకోవాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . మీ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం తీవ్రంగా చర్చించుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆదాయం పెరగడం వల్ల ఇబ్బందులు ఉండవు. దూర ప్రయాణాలు చేయాల్సిన సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడం వాయిదా వేయాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. వీరికి అన్ని అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు ఇదే మంచి సమయం.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనసులో నుంచి ప్రతికూల ఆలోచనలు తీసివేయాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు నిర్వహించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలి. కొన్ని పనుల వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం కాస్త ఉధృతంగా ఉండవచ్చు. ఇలాంటి సమయంలో ఓపిక ఉండాలి. అనవసరపు మాటలతో కొందరు ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటే మౌనంగా ఉండడమే మంచిది. కొన్ని విషయాల్లో స్నేహితులు సహాయం చేస్తారు. అనుకోకుండా ధన లాభం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండడంతో వారి ఆలోచనలు ఇతరులతో పంచుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా మారతారు. విద్యార్థులు తమ తెలివితేటలతో పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. అందమైన ఆహారాన్ని తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉపాధి కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే దూకుడు స్వభావాన్ని తగ్గించాలి. లేకుంటే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు అధిక ఆదాయాన్ని పొందుతారు. కొత్త ప్రాజెక్టును చేపడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . మీరు ఆశీర్వాదం ఈరోజు ఓ శుభకార్యం గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఏమైనా వారికి దగ్గరగా అవుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కష్టపడి పనిచేసిన వారికి ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇతరుల సలహా తీసుకోవాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : స్థిరాస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. మిగతా భాగస్వామితో ఆనందంగా ఉంటారు. వ్యాపారులు ప్రయాణాలు చేయాల్సివస్తుంది. మీ భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. అయితే గురువుల మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. మీ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా ప్రయోజనాలు ఉండనున్నాయి. వ్యాపార అభివృద్ధి కోసం భాగస్వాములతో చర్చిస్తారు. ఆ విషయంలో జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. పిల్లల కెరీర్ పై దృష్టి పెడతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనాల్సి వస్తే కాస్త సమయం తీసుకోవాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. అందువల్ల మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular