Prabhas : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రభాస్ (Prabhas) లాంటి నటుడు సైతం తను చేయబోతున్న సినిమాల కోసం అహర్నిశలు కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. తను అనుకున్న విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్న ప్రభాస్ ఇక చేయబోతున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా పాన్ ఇండియా మొత్తాన్ని తనవైపు తిప్పుకొని ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమా కోసం తన పూర్తి డేట్స్ ని కేటాయించాడు. తొందర్లోనే ఈ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం తన డేట్స్ కేటాయించే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా అతన్ని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం అయితే చేశారు.
Also Read : ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ వల్ల కెరియర్ పోగొట్టుకున్న స్టార్ హీరో…
ఇక మీదట చేయబోతున్న సినిమాల్లో కూడా ఆయనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని తనను తాను స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా ప్రభాస్ లాంటి నటుడు తన పరిధిని దాటి పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి దూసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు.
ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో రాబోతుంది. మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే హాలీవుడ్ నుంచి ప్రభాస్ కి భారీ ఆఫర్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సలార్ (Salaar), కల్కి (Kalki) సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు రాబోతున్న సినిమాలతో కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే వరుస విజయాలను సాధిస్తూ ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి ప్రభాస్ రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?