Amaravati Re Launch: అమరావతి ( Amravati ) ప్రాంతంలో పండుగ సందడి చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజధాని ప్రాంతం తో పాటు అన్ని జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే సభా వేదిక వద్ద ఉన్న గ్యాలరీలు నిండిపోయాయి. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. కార్యక్రమానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి హెలిక్యాప్టర్లో సభా వేదికకు రానున్నారు. అమరావతి లో అడుగు పెడుతూనే.. ప్రధాని సచివాలయానికి వెళ్ళనున్నారు.
Also Read: దేశభద్రతకు ఏపీ మార్గదర్శి..గుల్లలమోదలో క్షిపణి కేంద్రం!
* ఐరన్ శిల్పాల వద్ద సెల్ఫీలు..
గన్నవరం ఎయిర్ పోర్టులో( Gannavaram airport) ప్రధాని నరేంద్ర మోడీకి ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు. కాగా సభా ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన ఐరన్ శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. సభా వేదిక వద్ద ఏర్పాటుచేసిన బుద్ధుడు, కాలచక్రం, ఎన్టీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహాలతో పాటు మేకింగ్ ఇండియా లోగో ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు అమరావతి అక్షరాలను సైతం రూపొందించారు. వీటిని ఐరన్ స్క్రాప్ తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపుతున్నారు. ఆ విగ్రహాల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
* భారీగా జనాలు..
అమరావతి సభా ప్రాంగణం జనాలతో రద్దీగా మారింది. ఎటువైపు చూసినా జనమే కనిపిస్తున్నారు. రాజధాని లోని వెలగపూడి లో( velaga poody) దాదాపు 276 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. మొత్తంగా అమరావతి రాజధానికి సంబంధించి 57940 కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోడీకి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. పనుల పునర్నిర్మాణానికి సంబంధించి పైలాన్ ఆవిష్కరణ ద్వారా సభ ప్రారంభం కానుంది.