Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు. ఇక యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ‘బాహుబలి 2’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టింది. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ 50% పూర్తయింది. ఇక మిగతా 50% ని కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వార్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికి హీరోల్లో మాత్రం తనకి ఉన్న ఏకైక ఫ్రెండ్ గోపిచంద్…
Also Read: హిట్ 3 మీద బజ్ మామూలుగా లేదుగా మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందంటే..?
వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ‘వర్షం’ (Varsham) అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అక్కడి నుంచి గోపీచంద్ (Gopichand) ఆ తర్వాత హీరోగా మారి మంచి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన మంచి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురాగా ప్రభాస్ ను నమ్మి యువి క్రియేషన్స్ తో కొలాబెరేట్ అయి ఆయన చేసిన సినిమాలు మాత్రం వరుసగా డిజాస్టర్ల బాటపట్టాయి. ముందుగా రాధాకృష్ణ డైరెక్షన్ లో ఆయన చేసిన జిల్ (Jil) సినిమా ప్లాప్ అయింది. అయితే మొదట గోపీచంద్ ఈ సినిమాని చేయాలని అనుకోలేదట…కేవలం ప్రభాస్ గురించే ఈ సినిమాని చేశాడు ఆ సినిమా ఫ్లాప్ అయింది.
ఇక అలాగే మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ చేసిన ‘పక్కా కమర్షియల్’ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమా స్టోరీ కూడా గోపీచంద్ కు నచ్చకపోయినా ప్రభాస్ ఫోర్స్ వల్లే ఈ సినిమా చేశాడు. మరి మొత్తానికైతే ప్రభాస్ వల్ల రెండు భారీ డిజాస్టర్ల ను మూటగట్టుకున్నాడు. దాని వల్ల గోపీచంద్ కెరియర్ చాలా వరకు వెనుకబడి పోయిందనే చెప్పాలి…
Also Read: రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి..?