Prabhas : ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా వచ్చేనెలలో రిలీజ్ అవుతుందంటూ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇప్పటికే మూడుసార్లు పోస్ట్ పోన్ అయింది. ఇక మీదట కూడా ఇలానే సినిమా డేట్ అనౌన్స్ చేసి ఇంకోసారి పోస్ట్ పోన్ చేస్తే మాత్రం అభిమానులు తీవ్రస్థాయిలో వ్యతిరేకతను చూపించే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దానికి తోడుగా ప్రభాస్ చేస్తున్న సినిమాలతో భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాతో ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రెండు సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక నెలరోజుల గ్యాప్ లోనే రెండు సినిమాలు రాబోతున్నాయి అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి దీని వల్ల రెండు సినిమాలకు ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రభాస్ వీలైనంత తొందరగా రాజాసాబ్ (Rajasaab) సినిమా రిలీజ్ చేసుకుంటే మంచిది. లేకపోతే మాత్రం ఫౌజీ సినిమా వచ్చి రాజాసాబ్ సినిమాను తొక్కేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : పెళ్ళైన అబ్బాయితో జాన్వీ కపూర్ షికార్లు..సంచలనంగా మారిన లేటెస్ట్ ఫోటోలు!
ఇక ఇప్పటికే హను రాఘవపూడి (Hanu Raghavapudi) సీతారామం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయనకు పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ అయితే దక్కింది. కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కిస్తున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ప్రభాస్ మాత్రం ఈ రెండు సినిమాలను ఫినిష్ చేసి స్పిరిట్ (Spirit) సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఇప్పుడు రాబోయే సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తేనే మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ను భారీగా పెంచుకున్న హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. లేకపోతే మాత్రం భారీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…