Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఏది చేసిన చాలా స్పెషల్ గా, కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన ధరించే దుస్తులు బాగా వైరల్ అవుతుంటాయి. రకరకాల ఫ్యాషన్ మోడల్స్ తో ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఆయన దుస్తులకు ఎక్కువ శాతం AA బ్రాండింగ్ ఉంటుంది. అయితే మొట్టమొదటిసారి ఆయన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు క్రియేట్ చేసిన ట్రెండ్ ని అనుసరించాడు. ఎన్నికల సమయంలో పవన్ ఫ్యాన్స్ ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. బైకుల మీద, కార్ల మీద ఎక్కడ చూసిన ఇదే ట్రెండింగ్ అవుతూ కనిపించింది. ఇదేదో బాగుంది అని మిగిలిన హీరోల అభిమానులు, రాజకీయ నాయకుల అభిమానులు కూడా ‘తాలూకా’ పేరుతో తమ అభిమాన హీరోల పేర్లను జత చేసుకున్నారు. ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఒక సంచలనం గా మారింది.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
ఇదే ట్రెండ్ ని అనుసరిస్తూ అల్లు అర్జున్ ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అనే మీమ్ ని తన టీ షర్ట్ పై వేసుకొని నేడు కనిపించాడు. ఇది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించినా ఈ టీ షర్ట్ ని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో తమ అభిమాన హీరోని ట్యాగ్ చేసి ‘ఏమిటన్నా ఇది’ అంటూ నవ్వుతున్నారు. రీసెంట్ గానే అల్లు అర్జున్ ముంబై లో జరిగిన ‘వేవ్స్ సమ్మిట్’ లో పాల్గొన్నాడు. అక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు ఈ టీ షర్ట్ ధరించి కనిపించాడు. దీనిని బట్టి అల్లు అర్జున్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యే మీమ్స్ ని ఎంతలా అనుసరిస్తాడో అర్థం అవుతుంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లను బాగా ఫాలో అవుతాడని తెలుస్తుంది. కాబట్టే ఆయనకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
ఇకపోతే ‘పుష్ప 2’ చిత్రం తో వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అల్లు అర్జున్, తన తదుపరి చిత్రాన్ని తమిళ డైరెక్టర్ అట్లీ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేశారు. ఆ వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ప్రకటన వీడియో తోనే హాలీవుడ్ సినిమాని చూడబోతున్నామా అనే ఫీలింగ్ ని రప్పించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ గా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే వంటి హీరోయిన్స్ ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది లోనే పూర్తి చేయాలనే పకడ్బందీ ప్లాన్ తో ఉన్నాడు అల్లు అర్జున్. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడట.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?