HomeజాతీయంReliance Jio IPO: ఎంత సబ్ స్క్రిప్షన్ వచ్చింది.. లిస్టింగ్ ఎప్పుడంటే

Reliance Jio IPO: ఎంత సబ్ స్క్రిప్షన్ వచ్చింది.. లిస్టింగ్ ఎప్పుడంటే

Reliance Jio IPO: రిలయన్స్ ఇండస్ట్రీ గ్రూపుకు సంబంధించిన జియో ఫ్లాట్ ఫార్మ్స్ ఐపిఓ (jio flat forms IPO) ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామాలలో ఒకటిగా నిలిచింది. తాజాగా అనుతున్న సమాచారం ప్రకారం ఈ ఐపీఓ అక్టోబర్ 23న ముగిసింది. మొత్తం 22.19 రెట్లు సబ్ స్క్రిప్షన్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మొత్తం కంపెనీ ఐపీఓ కాదు. ఈ గ్రూపులో జియో ఫ్లాట్ ఫామ్స్ లిమిటెడ్ […]

Reliance Jio IPO: రిలయన్స్ ఇండస్ట్రీ గ్రూపుకు సంబంధించిన జియో ఫ్లాట్ ఫార్మ్స్ ఐపిఓ (jio flat forms IPO) ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామాలలో ఒకటిగా నిలిచింది. తాజాగా అనుతున్న సమాచారం ప్రకారం ఈ ఐపీఓ అక్టోబర్ 23న ముగిసింది. మొత్తం 22.19 రెట్లు సబ్ స్క్రిప్షన్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మొత్తం కంపెనీ ఐపీఓ కాదు. ఈ గ్రూపులో జియో ఫ్లాట్ ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ గా భావించాలి. సమీకరించిన నిధుల ద్వారా జియో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తుందని తెలుస్తోంది. ఇంటర్నెట్ వ్యాపారంలో లక్షల కోట్లు సంపాందించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే రిలయన్స్ ఈ పని చేసిందని వార్తలు వస్తున్నాయి.

ఐపీఓ విలువ ఎంతుందంటే..

ఐపీఓ మొత్తం విలువ 30,213 కోట్లు. ఒక్కొక్క షేరు ధర 1065 నుంచి 1119 రూపాయలు. కనీస లాట్ 12 షేర్లు. కనీస పెట్టుబడి 13428 రూపాయలు. మొత్తం సబ్ స్క్రిప్షన్ 22.19 రెట్లు. సంస్థగత పెట్టుబడిదారుల విభాగంలో 70.55 రెట్లు డిమాండ్ నమోదయింది. రిటైల్ విభాగంలో 2.72 రెట్లు సబ్ స్క్రిప్షన్ నమోదయింది. అక్టోబర్ 26ను అలాట్మెంట్ తేదీగా ఖరారు చేశారు. అక్టోబర్ 27న రిఫండ్లు మొదలవుతాయి. షేర్లు డిమార్ట్ ఖాతాలో జమవుతాయి. అక్టోబర్ 28న ఎన్ ఎస్ ఈ, బీఎస్ఈ లో లిస్టింగ్ జరుగుతుంది.

మార్పు వస్తుందా

ఐపిఓ ముగిసే సమయానికి గ్రే మార్కెట్లో ఒక్కో షేర్ పై సుమారు 238 ప్రీమియం అంటే గరిష్ట ఇష్యూ దరిత పోలిస్తే దాదాపు 21 శాతం ప్రీమియం నమోదయింది. అయితే ఇది గ్రే మార్కెట్ అంచనా మాత్రమే. వాస్తవ లిస్టింగ్ ధర దీనికంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. అయితే దీనిని లాభానికి హామీ లాగా అసలు భావించకూడదు.

దరఖాస్తు చేసిన వారు ఇప్పుడేం చేయాలి

అలాట్మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడాలి. ఎన్ఎస్ఈ అధికారిక ఇష్యూ వివరాలు పరిశీలించాలి. షేర్లు రాకపోతే బ్యాంకు ఖాతాలో బ్లాక్ చేసిన మొత్తం విడుదలైందో లేదో చూడాలి. జియో విభాగాలను మరింత విస్తరించడానికి.. గ్లోబల్ వ్యాప్తంగా ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ముకేశ్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మస్క్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ముఖేష్ అంబానీ.. తన సామ్రాజ్యాన్ని ప్రపంచ స్థాయి వ్యవస్థగా ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper