Prabhas Comedy Character In Rajasaab: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి నటుడు చేస్తున్న సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక సలార్ (Salaar),కల్కి (Kalki) రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించాడు. ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు… ఇక ఆయన చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇక ఇవే కాకుండా ఆయనలోని పూర్తిస్థాయి నటుడిని సైతం బయటికి తీసే విధంగా ఆ సినిమాలు ఉంటున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే తనను తాను చాలా వరకు మిస్ అయిపోతున్నారని తెలుసుకొని తన అభిమానులు తన నుంచి కోరుకునేది ఎంటర్టైన్మెంట్ అని భావించిన ప్రభాస్ రాజాసాబ్ సినిమా చేశాడు. ఒకప్పుడు బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి సినిమాలు చేసి చాలా వండర్ ఫుల్ సక్సెస్ లను సాధించాడు. అలాగే ఆ సినిమాల్లో ఆయన చేసిన కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు రాజాసాబ్ సినిమాని సైతం హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది…
Also Read: Prabhas: ప్రభాస్ ఆ సినిమాను అందుకే రిజెక్ట్ చేశాడా..?
బుజ్జిగాడు, డార్లింగ్ సినిమాలతో మంచి విజయాలను సాధించిన ప్రభాస్ రాజాసాబ్ సినిమాను కూడా సక్సెస్ ఫుల్ గా నిల్పుతాడా లేదా అని అతని అభిమానులైతే భావిస్తున్నారు. నిజానికి ప్రభాస్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ టీజర్ చివర్లో పవర్ కట్ అవ్వడంతో ప్రభాస్ భయపడుతూ తాత ఏదో వైర్ కొరికేసినట్టున్నాడు అని చెప్పే డైలాగ్ సూపర్ గా పేలింది. అలాగే ఆయన కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా సెట్ అయింది.
ఇదే రేంజ్ లో కనక సినిమాలో కామెడీ ఉన్నట్టయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ప్రభాస్ కటౌట్ చూసి చాలామంది ఆయన యాక్షన్ సినిమాలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. నిజానికి యాక్షన్ సినిమాలు చేసిన కూడా ఆయన చాలా బాగా సెట్ అవుతాడు.
ఆ జానర్ సినిమాల్లో ప్రభాస్ ను మించిన వారు ఎవరూ లేరు. ఆయన యాక్షన్ సినిమా చేస్తూనే తనలోని కామెడీని బయట పెడితే మాత్రం ఆ సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇక ఈ సినిమాలో మనం పూర్తిస్థాయి ప్రభాస్ కామెడీని ఎంజాయ్ చేయొచ్చు అని దర్శకుడు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే టీజర్ లో కూడా అదే చేసినట్టుగా తెలుస్తోంది…