RajaSaab Teaser Review: అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన రాజా సాబ్ మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ముందుగా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని లాంచ్ చేసారు. ఆ తర్వాత కాసేపటికి యూట్యూబ్ లో విడుదల చేసారు. అభిమానులు, ప్రేక్షకులు గత కొంత కాలం గా ప్రభాస్ నుండి కామెడీ టైమింగ్ ని బాగా మిస్ అవుతూ వచ్చారు. ఈ చిత్రం లో ఆయన కామెడీ టైమింగ్ ని ఫుల్ గా వాడుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా హారర్ ఎలిమెంట్స్ కూడా బాగా కుదిరాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో దెయ్యాన్ని చూసి ప్రభాస్ తో పాటు తన స్నేహితులు కూడా దాక్కోడం. కరెంటు కట్ అయ్యాక ‘బయట తాత వైర్లు కొరికేశాడేమో కాస్త చూడండి రా’ అంటూ ప్రభాస్ అమాయకంగా చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఇది కదా ఇన్ని రోజులుగా ప్రభాస్ నుండి మేము ఎదురు చూసింది. పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లిన తర్వాత ప్రభాస్ లోకల్ మాస్ కి బాగా దూరమైనా ఫీలింగ్ ని ఈ సినిమా దూరం చేసింది.
ఇక గ్రాఫిక్స్ విషయం లో కూడా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది. ముందుగా గ్రాఫిక్స్ సరిగా రాలేదని రీ వర్క్ చేయించారు. రీసెంట్ గానే కెనడా VFX కంపెనీ నుండి VFX షాట్స్ మొత్తం డెలివరీ అయ్యాయి. అందులోని కొన్ని షాట్స్ ని ట్రైలర్ లో అప్డేట్ చేశారు. అవి చాలా అడుతంగా వచ్చాయి. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ క్యారక్టర్, అదే విధంగా మాళవిక మోహనం క్యారక్టర్ కూడా అదిరిపోయినట్టు తెలుస్తుంది. రెగ్యులర్ ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాలను చూసి అలవాటైన జనాలకు ఇది ప్రభాస్ రేంజ్ సినిమా కాదు అని అనిపించొచ్చు కానీ, అభిమానులకు మాత్రం విజువల్ ఫీస్ట్ అనొచ్చు.
ఇదంతా పక్కన పెడితే గత ఏడాది విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో ప్రభాస్ వయస్సు మీదపడిన రాజు గెటప్ లో కనిపించాడు. దీంతో ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ తాత క్యారక్టర్ కూడా ప్రభాస్ చేసాడేమో, డ్యూయల్ రోల్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ తాత క్యారెక్టర్ లో సంజయ్ దత్ కనిపించే లోపు ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. సంజయ్ దత్ తాత క్యారక్టర్ చేస్తే మోషన్ పోస్టర్ లో ప్రభాస్ ఎందుకు అలా కనిపించ్చాడు అనే సర్ప్రైజ్ ఎలిమెంట్ తెలుసుకోవాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం కేవలం టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా భారీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈమధ్య కాలం లో బాలీవుడ్ హారర్ సినిమాలు శాసిస్తున్నాయి. అందుకు బెస్ట్ ఉదాహరణ ‘స్త్రీ2’. ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో క్లిక్ అవుతుందని బావిస్తున్నారు ఫ్యాన్స్.