Prabhas: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఆయన చేసే సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ని క్రియేట్ చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేస్తున్నాయి…
Also Read: నయనతార మారిపోయింది, చిరంజీవి కోసమేనా?
బాహుబలి( Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తన ఫ్లాప్ సినిమాలకి సైతం భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే రేంజ్ కి ప్రభాస్ వెళ్లిపోయాడు అంటే ఆయన ఎంతటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు…బాలీవుడ్ ప్రేక్షకులైతే స్క్రీన్ మీద ఒకసారి ప్రభాస్ ను చూస్తే చాలు అనుకునేంత రేంజ్ లో ఆయన స్టార్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి వచ్చే సంవత్సరం ఆయన నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ (Student Number One) సినిమా కథని మొదట ప్రభాస్ కి వినిపించారట. ప్రభాస్ ఆ కథను విని రిజెక్ట్ చేసినట్టుగా పలు సందర్భాల్లో తెలియజేశాడు.
ఎందుకంటే ఆ సినిమాలో హీరో జైలు లో ఉండి లా చదవడం…ఆ తర్వాత వాళ్ళ నాన్నను సేవ్ చేయడం అనేది ఆయనకి నచ్చలేదట. అందువల్లే ఆ కథ తనకు నచ్చలేదని దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో ఆ తర్వాత ఛత్రపతి (Chatrapathi), బాహుబలి (Bahubabli) లాంటి సినిమాలు రావడం విశేషం…మరి వీళ్లిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసుకున్న వీళ్ళిద్దరూ మరోసారి మరో సినిమా చేస్తే చూడాలని యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు… ఇక ప్రభాస్ కెరియర్ మొదట్లో చాలా యాక్షన్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇప్పుడు మాత్రం కాన్సెప్ట్ ఉండే విధంగా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమా కోసం తన పూర్తి ఫోకస్ ని పెట్టినట్టుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం లో ఆయన రెండు సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు..మరి ఆ సినిమాలతో ఆయన గొప్ప గుర్తింపు సంపాదించుకొని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలిగితే మాత్రం ఆయన మరోసారి పాన్ ఇండియాలోనే కాకుండా పాన్ వరల్డ్ లో కూడా తన సత్తాను చాటుకుంటాడు…