Meghalaya Honeymoon Case Latest Updates: సమ్మర్ కావడంతో ఇటీవల ఓ టూరిస్ట్ మేఘాలయ కు వెళ్లిపోయాడు. అక్కడ అతడు సరదాగా ట్రెక్కింగ్ కు వెళ్ళాడు. దానికి సంబంధించిన దృశ్యాలను తన ఫోన్లో బంధించడానికి అతడు కెమెరా ఆన్ చేశాడు. ఆ కెమెరాలు రికార్డు అవుతున్న వీడియోలో రఘు వంశీ, అతని భార్య సోనమ్ రికార్డయ్యారు. సోనమ్ తెల్లటి టీషర్టు ధరించి ముందు వరుసలో నడిచింది. రాజా రఘు వంశీ ఆమెను అనుసరిస్తూ వెనుక కనిపించాడు.. రాజా రఘు వంశీ ఇండోర్లో ఒక వ్యాపారవేత్త. అతడు హత్యకు గురై ఇప్పటికే 24 రోజులు గడిచిపోయాయి. అతడి హత్య కేసులో ఇప్పటికే పోలీసులు భార్య సోనమ్, మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రస్తుతం పోలీసు రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికే వారు రాజా రఘువంశీని హత్య చేసినట్టు అంగీకరించారు. అయినప్పటికీ ఈ కేసులో మరిన్ని కీలక వివరాలను తెలుసుకోవడానికి.. అసలు నిజాలను బయటపెట్టడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తులో ఉండగానే ఈ కీలక వీడియో వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియోలో రఘు వంశీ, సోనమ్ ట్రెక్కింగ్ చేయడానికి వెళుతున్నారు. ఆ సమయంలో టూరిస్ట్ కెమెరా ఆన్ చేయడంతో.. వారిద్దరూ అందులో రికార్డు అయ్యారు.
సమ్మర్ కావడంతో మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ప్రాంతాన్ని సందర్శించడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ క్రమంలో డబుల్ డెక్కర్ బ్రిడ్జి ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడు వీడియో తీశాడు.. అతడు కెమెరా ఆన్ చేయగా రఘు వంశీ, సోనమ్ అందులో రికార్డ్ అయ్యారని ఆ టూరిస్ట్ చెబుతున్నాడు.. మరోవైపు రఘు వంశీ మృతదేహం వద్ద తెల్లటి చొక్కా లభించింది. అయితే ఆ టూరిస్ట్ తీసిన ఆ వీడియోలో తెల్లటి చొక్కాను సోనం ధరించడం విశేషం. రఘువంశీ హత్యకు ముందు సోనం.. అతడు కట్టిన తాలిని, మెట్టలను హోటల్ రూమ్ లో ఉంచి వెళ్లిపోయింది. సహజంగా పెళ్లయిన ఆడవాళ్లు.. అది కూడా వివాహం జరిగిన వారం రోజుల్లోనే తాళిని తీసేయరు.. మెట్టెలు కూడా తొలగించుకోరు. కానీ సోనం ఆ పని చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఆ దిశగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం వెలుగు చూసింది. ఈ క్రమంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో సోనం వ్యవహారం బయటపడింది.
పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. మేఘాలయ వెళ్లిన టూరిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. వాటిని కోర్టులో సమర్పించడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. ఇంతలోనే ఓ టూరిస్ట్ పోస్ట్ చేసిన వీడియో పోలీసులకు బలమైన ఆధారాన్ని ఇచ్చినట్టయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram