Bigg Boss 10 Telugu: ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ లోని ఫిజికల్ టాస్క్ వేరు , ఈ సీజన్ లో నేడు జరిగిన ఫిజికల్ టాస్క్ వేరు. ఈ రేంజ్ టాస్క్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదని అంటున్నారు విశ్లేషకులు. టాస్క్ ఏమిటంటే, హౌస్ బయట నుండి కొన్ని బస్తాలు విసురుతారు. ఆ బస్తాల్లో కొన్ని బాల్స్ ని ఉంటాయి. వాటిని తీసుకొని , ఎదురుగా ఉన్న బోర్డ్స్ కి గట్టిగా కొట్టాలి. అప్పుడు ఎవరి బోర్డ్స్ లోని బ్రిక్స్ ఎక్కువగా క్రింద పడుతాయో , వాళ్ళు ఈ టాస్క్ లో గెలిచినట్టు అన్నమాట. వినేందుకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదూ. కానీ ఘోరమైన ఫిజికల్ అయ్యేందుకు ఆస్కారం ఉన్న టాస్క్ ఇది. దేబ్జాని , రోహిత్ ఒక టీం కాగా, రామ్ ప్రసాద్ , త్రిగున్ మరో జట్టు.
ఈ టాస్క్ నలుగురు అబ్బాయిల మధ్య జరిగి ఉంటే బాగుండేది , కానీ ముగ్గురు అబ్బాయిలు , ఒక అమ్మాయి అయ్యేలోపు , కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఫిజికల్ వార్స్ చాలా బలంగానే జరిగాయి. అవతల పక్క రామ్ ప్రసాద్ , త్రిగున్ లాంటి బలమైన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ , రోహిత్ వాళ్ళిద్దరిని అడ్డుకునేందుకు సాధారణమైనంత వరకు ఎఫోర్ట్స్ పెట్టాడు. ఈ టాస్క్ లో మంచి పేరు తెచ్చుకున్నది ఎవరైనా ఉన్నారా అంటే అది దేబ్జాని నే . ముగ్గురు మగాళ్ల మధ్య ఆమె ఆడిన తీరు ఏదైతే ఉందో , అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆమెలో ఇంత స్ట్రెంగ్త్ ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కచ్చితంగా ఈ వీకెండ్ నాగార్జున ఈమెకు సెల్యూట్ చేస్తాడని చెప్పొచ్చు.
ఇకపోతే ఈ టాస్క్ WWE మ్యాచ్ ని కూడా తలపించింది. ముఖ్యంగా రోహిత్, త్రిగున్ చాలా ఫిజికల్ అయ్యారు. అంతే కాదు సంచాలక్ గా వ్యవహరించిన వంశీ తో కూడా రోహిత్ కి గొడవ జరిగింది. ఇద్దరు ఒక రేంజ్ లో అరుచుకున్నారు. కొట్లాడుకునే వరకు వెళ్లారు. కాసేపటి క్రితమే ఈ టాస్క్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమో లో మీరు చూసింది 1 శాతం మాత్రమే. జియో హాట్ స్టార్ లైవ్ లో ఈ టాస్కుని చూసిన వాళ్లకు గూస్ బంప్స్ వచ్చిందని చెప్పొచ్చు. చివర్లో రోహిత్ , త్రిగున్ కి బాగా దెబ్బలు తగిలాయి. రోహిత్ ఉపవాసం లో ఉండడం తో తదుపరి గేమ్ ని కొనసాగించడానికి సిద్ధం గా లేడు. కానీ దేబ్జాని కోసం చివరికి ఓపిక చేసుకొని రావాల్సి వచ్చింది. ఈ ఓవరాల్ టాస్క్ తో దేబ్జాని కి మంచి పేరొచ్చింది అని చెప్పొచ్చు. ఆమె గ్రాఫ్ వేరే లెవెల్ కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.