spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas Adipurush Movie: ప్రభాస్ ఫ్యాన్స్ కి సడెన్ సర్ ప్రైజ్.. డేట్...

Prabhas Adipurush Movie: ప్రభాస్ ఫ్యాన్స్ కి సడెన్ సర్ ప్రైజ్.. డేట్ ఫిక్స్ !

నేషనల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా “ఏ- ఆది పురుష్”.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ చిత్రబృందం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ తాజాగా అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించారు.
Prabhas Adipurush Movie

ఒక విధంగా ఈ పాన్ ఇండియా సినిమాని వేగంగా పూర్తి చేసినట్టే. బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకి ప్రభాస్ గ్యాప్ లేకుండా డేట్స్ ఇచ్చాడు. హాలిడేస్ లో కూడా ప్రభాస్ ఈ సినిమా కోసం వర్క్ చేశాడు. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. ప్రభాస్ సినీ కెరీర్ లోనే మొదటిసారి పౌరాణిక పాత్ర చేయబోతున్నాడు.

పైగా ఒక దేవుడి పాత్ర. అందుకే, ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే సీతగా కృతి సనోన్‌ నటిస్తోంది. భారీ తారాగణం.. మరోపక్క ఆదికావ్యం రామాయణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అన్నిటికీ మించి ఈ సినిమాలో స్పెషల్ మేకప్ మరియు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నారు.

ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్ ముఖంలో చాలా మార్పులు తీసుకురాబోతున్నారు. అందుకే బాలీవుడ్ సంస్థ టీ సిరీస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తోంది. నిజానికి టీ సిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, ఒక సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే.

మరోపక్క ప్రభాస్ కూడా తన మార్కెట్ కి తగ్గట్టుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటూ నిజమైన పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాలో సీతగా కృతి సనోన్‌ నటిస్తోంది.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version