Homeఎంటర్టైన్మెంట్Photo Story: నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Photo Story: నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శివ. ఇది ఒక సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీనే ఊపేసింది. నూతన శకాన్ని ఆరంభించింది. ఈ సినిమాలో నాగార్జునతో ఉండే అనుచరుల్లో ఒకడిగా కనిపించే పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. దీంతో ఓ సీన్ లో నాగార్జున వెనకాలే కనిపిస్తాడు.

Photo Story: కొన్ని ఫొటోల చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పరిశ్రమకు దర్శకులు కావాలని వచ్చిన వారు చాలా మంది హీరోలుగా మారారు. హీరోలుగా చేద్దామని వచ్చిన వారు డైరెక్టర్లుగా అవతారమెత్తారు. దర్శకులు కావాలని వచ్చిన వారు మొదట అసిస్టెంట్ విభాగంలో పనిచేస్తూ అప్పుడప్పుడు కొన్ని సీన్లలో నటించి మెప్పించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే కోవలో మన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఉంటారు.

సోషల్ మీడియాలో..

నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శివ. ఇది ఒక సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీనే ఊపేసింది. నూతన శకాన్ని ఆరంభించింది. ఈ సినిమాలో నాగార్జునతో ఉండే అనుచరుల్లో ఒకడిగా కనిపించే పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. దీంతో ఓ సీన్ లో నాగార్జున వెనకాలే కనిపిస్తాడు.

బద్రి సినిమాతో..

ఎప్పుడు కొత్తగా ఆలోచించే ఆర్జీవీ ఇప్పుడు ఈ ఫొటో పిక్ ను సోషల్ మీడియాలో పెట్టాడు. అప్పుడు సన్నగా టక్ చేసుకుని నాగార్జున వెనకాలే కనిపిస్తున్నాడు పూరీ. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మా అభిమాన దర్శకుడు ఇలా ఉండేవాడా అని ఆశ్చర్యపోతున్నారు. పూరీ జగన్నాథ్ బద్రి సినిమాతో దర్శకుడిగా మారాడు.

అప్పటి ఫొటో

ప్రస్తుతం తానో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇట్టు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి తదితర సినిమాలో నూతన ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇలా అప్పటి ఫొటోలు ఇప్పుడు దర్శనమిస్తే ఇలాగే అందరు ఆశ్చర్యానికి గురి కావడం మామూలే. ఇలా వర్మ తన ఆలోచనలతో అప్పుడప్పుడు అందరిలో ఏవో వండర్స్ సృష్టించడం ఆయనకు అలవాటే

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Oktelugu Epaper