Peddi Movie Ticket Rates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయి లో జరిగింది. తెలుగు , తమిళం , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అక్షరాలా 220 కోట్ల రూపాయిలు. అంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 430 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు సాధిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కష్టం. అందుకే నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం ప్రభుత్వాలను అనుమతి కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి చాలా తేలికగా అనుమతి వచ్చింది , కానీ తెలంగాణ లో వస్తుందో లేదో అనే అనుమానం ఉండేది.
ఎందుకంటే తెలంగాణ లో ప్రీమియర్ షోస్ కి భారీ టికెట్ రేట్స్ ని పెంచడం , అదే విధంగా రెగ్యులర్ షోస్ కి కూడా టికెట్ రేట్స్ పెంచడం పై హై కోర్టు నుండి అనుమతి లేదు. ఈ కారణం చేత తెలంగాణ లో టికెట్ రేట్స్ పెంపు అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ టికెట్ రేట్స్ పెంపు కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టుగానే , 600 రూపాయిల వరకు ఉంటుంది. అదే విధంగా రెగ్యులర్ షోస్ కి గానూ 100 రూపాయిలు , అదే విధంగా మల్టీప్లెక్స్ షోస్ కి గానూ 150 రూపాయిలు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 11 రోజుల వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. కాసేపట్లో అధికారికంగా జీవో ని కూడా విడుదల చేయబోతున్నారు.
ప్రభుత్వం అనుమతించిన టికెట్ రేట్స్ పెంపు ప్రకారం అయితే సింగల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ రేట్ 275 రూపాయిలు ఉంటుంది , అదే విధంగా మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో ఒక్క టికెట్ రేట్ 445 రూపాయిలు ఉండనుంది. మరి ఈ టికెట్ రేట్స్ ప్రభావం కారణంగా పెద్ది సినిమాకు మేలు జరుగుతుందా?, లేదంటే నష్టం జరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే తెలంగాణ లో అన్ని ప్రాంతాలు లాగా టికెట్ రేట్స్ ఎక్కువ పెంచితే జనాలు చూసేందుకు సిద్ధంగా లేరు. హైదరాబాద్ లో చూస్తున్నారు కానీ , తెలంగాణ జిల్లాల్లో మాత్రం టికెట్ హైక్స్ భారీ ప్రభావం చూపిస్తోంది , సినిమాని చూసే ఆడియన్స్ సంఖ్య ఈ కారణం చేత బాగా తగ్గిపోయింది , చూడాలి మరి పెద్ది కి ఏమి జరగబోతుంది అనేది.
