Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Second Song: 'నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే…నువ్వేమి పొడిచావనే'..పెద్ది 2వ పాట...

Peddi Movie Second Song: ‘నీ అయ్య వడ్డీ…నీ బిడ్డ కడితే…నువ్వేమి పొడిచావనే’..పెద్ది 2వ పాట వచ్చేస్తోంది !

Peddi Movie Second Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు . ఎందుకంటే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ అలాంటిది మరీ. గత ఏడాది ఏప్రిల్ నెలలో […]

Peddi Movie Second Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు . ఎందుకంటే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ అలాంటిది మరీ. గత ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నవంబర్ నెలలో విడుదల చేసిన ‘చికిరి చికిరి ‘ పాట అయితే ఈ సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది. ఈ పాట కారణంగా గా ఈ సినిమా ఆల్బమ్ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. రెండవ పాట అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు.

Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

కానీ మూవీ టీం అప్డేట్ ఇవ్వడం బాగా ఆలస్యం చేయడం తో అభిమానులు కాస్త చిరాకు పడ్డారు.వాస్తవానికి ఈ రెండవ ఫిబ్రవరి మొదటి వారం లోనే విడుదల అవ్వాలి. కానీ అప్పటికీ మూవీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉండడం , డైరెక్టర్ బుచ్చి బాబు ఫోకస్ మొత్తం షూటింగ్ వైపే ఉండడం వల్ల ఈ పాట విడుదల అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ పాటని మార్చి 2 న విడుదల చేయబోతున్నట్టు నిన్న అధికారిక ప్రకటన చేశారు . డైరెక్టర్ బుచ్చి బాబు ఒక ట్వీట్ వేస్తూ ‘నీ అయ్య వడ్డీ…నీ బిడ్డ కడితే…నువ్వేమి పొడిచావనే!!రై రై రారా రై రై రారా ‘ అనే లిరిక్ ని పోస్ట్ చేస్తూ పోస్టర్ ని వదిలాడు. దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . లిరిక్స్ అదిరిపోయాయి. చూస్తుంటే ఈ పాట కూడా పెద్ద హిట్ అయ్యేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

త్వరలోనే ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేస్తారట . ఈ పాటకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. ‘చికిరి చికిరి’ పాటలోని స్టెప్పులు కేవలం ఒక టీజర్ మాత్రమే. ఈ పాటలో స్టెప్పులకు ఫ్యాన్స్ మెంటలెక్కిపోతారని, రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ డ్యాన్స్ సాంగ్స్ లో ఒకటిగా ఈ పాట నిలిచిపోతుందని అంటున్నారు. నిజంగా ఈ రేంజ్ లో పాట ఉంటే ఏప్రిల్ 30 న థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పండగ మామూలు రేంజ్ లో ఉండడు అనే చెప్పాలి .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper