Peddhi
Peddhi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ఉగాది కానుకగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉండడంతో ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేసింది. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్టుగా సినిమా యూనిట్ అయితే అనౌన్స్ చేశారు. మరి గ్లింప్స్ అద్భుతంగా ఉంటుందని ఇంతకుముందు ఈ సినిమా ప్రొడ్యూసర్ రవిశంకర్ చాలా వరకు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేశాడు. ఇక దాంతో మెగా అభిమానులు అందరూ ఏప్రిల్ 6 వ తేదీ ఎప్పుడు వస్తుందా గ్లింప్స్ ఎప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : ‘పెద్ది’ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం..పోస్టర్ అదుర్స్!
మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి రాబోయే గ్లింప్స్ ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తోంది. దీంతో సినిమా మీద అంచనాలు పెంచేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి గ్లింప్స్ వచ్చిన తర్వాత తారాస్థాయికి చేరుకునే అవకాశమైతే ఉంది… ఇక బుచ్చిబాబు తన రెండోవ సినిమాతోనే స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది. తద్వారా బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ కి ఇప్పుడు సక్సెస్ అనేది చాలా కీలకం.
ఈ సంవత్సరం సంక్రాంతి కానుక వచ్చిన గేమ్ చేంజర్ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన కొంతవరకు డీలాపడ్డాడు మరి ఇప్పుడు మరోసారి తన స్టార్ డమ్ విస్తరించుకోవాలంటే మాత్రం పక్కాగా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
Also Read : శ్రీ రామనవమి కి ‘పెద్ది’ టీజర్..పవర్ ఫుల్ డైలాగ్స్ లీక్!