Balayya : హిందూపురం( hindupuram ) నుంచి హ్యాట్రిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna). హిందూపురం అంటే బాలకృష్ణ అడ్డాగా మార్చేశారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా హిందూపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019లో సైతం జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడ్డారు బాలయ్య. 2024 లో అయితే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ పై ప్రత్యేకతలు ఎంతటి నెగిటివ్ ప్రచారం చేసినా.. ఆయనను అక్కున చేర్చుకున్నారు హిందూపురం ప్రజలు. అయితే ఇటీవల బాలకృష్ణ నియోజకవర్గంలో కనిపించకపోయేసరికి ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయింది. ఏకంగా టిడిపి నిర్వహించిన ప్రజా దర్బార్ లోనే ఫిర్యాదులు వచ్చాయంటే బాలకృష్ణపై అభిమానం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. అటు ఆ మధ్యన అక్కడక్కడ హిందూపురంలో బ్యానర్లు కూడా కట్టారట. బాలకృష్ణ కనిపించడం లేదని.
Also Read : ఆ విషయం లో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన బాలయ్య…వర్కౌట్ అవుతుందా..?
* తొలిసారిగా అసెంబ్లీలో
2014లో తొలిసారిగా హిందూపురం నుంచి గెలిచారు బాలకృష్ణ. ఆ సమయంలో సినిమాల్లో చాలా బిజీగా ఉండేవారు. అప్పుడప్పుడు హిందూపురం నియోజకవర్గానికి వచ్చేవారు. అయితే ఇక్కడ కార్యకలాపాలను చూసుకునేందుకు ఒక పిఏ ను ఏర్పాటు చేశారు. కానీ ఆ పిఎ సొంత అజెండా అమలు చేయడం ప్రారంభించారు. దీంతో విసిగి వేసారి పోయిన టిడిపి శ్రేణులే ఆయనపై అప్పట్లో దాడికి దిగడం సంచలనం రేకెత్తించింది. అటు తరువాత తానే సొంతంగానే కార్యకలాపాలను చూస్తూ వచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించేవారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేవారు.
* జగన్ ప్రభంజనంలో..
2019లో బాలకృష్ణ గెలిచారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధికారంలోకి వచ్చింది. దీంతో విపక్ష ఎమ్మెల్యేగా మారారు బాలకృష్ణ. హిందూపురంలో పట్టు బిగించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. మరోవైపు బాలకృష్ణ సైతం ప్రజా పోరాటాలకు ముందుండే వారు. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టేందుకు ముందుకు వచ్చేవారు. తరచూ హిందూపురంలో పర్యటించేవారు. శ్రీ సత్య సాయి జిల్లాను హిందూపురం జిల్లాగా మార్చాలన్న డిమాండ్ తో కొద్దిరోజుల పాటు పోరాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక జిల్లా ప్రకటిస్తామని కూడా చెప్పుకొచ్చారు బాలకృష్ణ.
* విదేశాల్లో బాలకృష్ణ
అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. బాలకృష్ణ ఒకటి రెండు సార్లు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించారు. తరువాత ముఖం చాటేసారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. సినిమా షూటింగ్లలో( cinema shootings ) బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఏకంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడ అంటూ ఫిర్యాదులు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో బాలకృష్ణ అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. అంతకుముందు కూడా హిందూపురం నియోజకవర్గంలో అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. తర్వాత వాటిని తొలగించారు. ఇప్పుడు మరోసారి అటువంటి ప్రచారమే జరుగుతోంది.
Also Read : బాలయ్య బాబు అఖండ 2 తో వెంకటేష్ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా..?