https://oktelugu.com/

Peddi: ‘పెద్ది’ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం..పోస్టర్ అదుర్స్!

Peddi ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గాల్లోకి ఎగిరి దూకుతున్నట్టుగా పెట్టిన ఫోజుకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ముఖం కనిపించేట్టు పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Written By: , Updated On : March 30, 2025 / 04:03 PM IST
Peddi

Peddi

Follow us on

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), బుచ్చి బాబు(Buchi Babu Sana) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా మా చరణ్ నుండి మేము ఆశించేది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రీ రికార్డింగ్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వెనక్కి తగ్గారు. ఉగాదికి, అనగా నేడు ఈ టీజర్ విడుదల అవుతుందని ఆశించారు కానీ, శ్రీ రామ నవమి నాడు , అనగా ఏప్రిల్ 6 న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు.

ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గాల్లోకి ఎగిరి దూకుతున్నట్టుగా పెట్టిన ఫోజుకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ముఖం కనిపించేట్టు పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ ప్రాంతంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఏప్రిల్ 6న విడుదల చేయబోయే టీజర్ లో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్నట్టుగా చూపించబోతున్నారు. అందుకే ‘ఫస్ట్ షాట్ ఆన్ ఏప్రిల్ 6’ అని క్రికెట్ భాషలో చెప్పుకొచ్చారు. అయితే పోస్టర్ వెనుక ఆంజనేయ స్వామీ ఉండే ఎర్ర జెండాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా సనాతన ధర్మం గురించి చర్చలు నడుస్తుండడంతో, అది క్యాష్ చేసుకునేందుకే ఈ అంశాలను మూవీ లో జోడిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

విడుదల తేదీని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ, టీజర్ లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ‘దేవర'(Devara Movie) వంటి భారీ హిట్ తర్వాత జాన్వీ కపూర్(Jhanvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, జగపతి బాబు, దివ్యేనందు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత AM రత్నం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలకు రెహమాన్ కి మించి అద్భుతమైన మ్యూజిక్ ఇండియా లో ఎవ్వరూ ఇవ్వలేరు. బుచ్చి బాబు సెలక్షన్ కి తిరుగేలేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆరంభం నుండే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ని మూటగట్టుకున్న ఈ సినిమా, టీజర్ విడుదల తేడా ఎలాంటి అంచనాలను ఏర్పాటు చేస్తుందో చూడాలి.