Peddi Teaser
Peddi Teaser: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చి బాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.’గేమ్ చేంజర్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘పెద్ది’ తో ఎలా అయినా భారీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ మేక్ ఓవర్ కి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఫిదా అయిపోయారు. కచ్చితంగా రామ్ చరణ్ భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఈ ఫస్ట్ లుక్ ని చూసిన తర్వాత అందరికీ అర్థం అయిపోయింది. వాస్తవానికి ఈ టీజర్ ని నిన్ననే విడుదల చేయాలనీ అనుకున్నారు. రీ రికార్డింగ్ వర్క్ పెండింగ్ లో ఉండడం వల్ల చేయలేకపోయారట.
ఇప్పుడు ఈ టీజర్ ని ఎట్టిపరిస్థితిలో ఉగాదికి, అనగా మార్చి 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఒకవేళ ఉగాదికి కాకపోతే శ్రీ రామనవమి కి అయిన దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టీజర్ లో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో నాలుగు పవర్ ఫుల్ డైలాగ్స్ ని చెప్తాడట. రంగస్థలం చిత్రం లో గోదావరి యాసలో రామ్ చరణ్ ఎలాంటి డైలాగ్స్ చెప్పి అలరించాడో, ఈసారి ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడట. రీసెంట్ గానే ఉత్తరాంధ్ర యాసలో ‘తండేల్’ చిత్రంలో నాగ చైతన్య ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడుతాడు. టీజర్, ట్రైలర్స్ లో ఆయన యాస సహజత్వానికి దూరంగా ఉన్నప్పటికీ, సినిమాలో మాత్రం పర్ఫెక్ట్ గా మాట్లాడాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే యాసలో మాట్లాడబోతుండడంతో కచ్చితంగా ‘తండేల్’ తో పోల్చి చూసే అవకాశాలు ఉన్నాయి.
అదే విధంగా ఇటీవల కాలం లో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ లో కూడా ఉత్తరాంధ్ర యాసనే మాట్లాడారు. ఈమధ్య కాలంలో ఈ యాసలో సినిమాలు ఎక్కువగా వస్తుండడంతో పెద్ది లో రామ్ చరణ్ ఎంత మేరకు సహజత్వానికి దగ్గరగా ఈ యాసలో డైలాగ్స్ చెప్తాడో చూడాలి. ఛాలెంజింగ్ రోల్స్ ని ఎంతో సహజం గా నటించే అలవాటు ఉన్న రామ్ చరణ్, ఈ సినిమాలో కూడా అదరగొట్టేస్తాడని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నత్తి పాత్రను ఎంత సహజంగా నటించాడో మనమంతా చూసాము. ఆ క్యారక్టర్ చూసిన తర్వాత అభిమానులు ‘పెద్ది’ పై అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను రామ్ చరణ్ అందుకుంటాడో లేదో చూడాలి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26 , 2026 వ సంవత్సరం లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.