Mahesh Babu , Rajamouli
Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్తే ప్రతి ఒక్కరికి రాజమౌళి గుర్తుకొస్తాడు. భారీ సినిమాలను తీయడంలో ఆయన మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు… బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఆయన సూపర్ సక్సెస్ లను అందుకున్నారు. మరి ఇకమీదట చేయబోయే సినిమాలను కూడా అంతకుమించి సక్సెస్ గా నిలపాలని చూస్తున్నాడు…
Also Read : మహేష్, రాజమౌళి సినిమా పై అలాంటి ఆశలు ఉంటే పప్పులో కాలేసినట్టే!
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నప్పటికి రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుందనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమా మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అందుకోసమే రాజమౌళి ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. దీని ద్వారా పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నమైతే చేస్తున్నాడు…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రాజమౌళి ఎంతైతే కష్టపడతాడో మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ఆరేంజ్ లోనే కష్టపడుతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక కష్టం విషయంలో ఇద్దరు ఇద్దరే అంటూ కొంతమంది వీళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు.
అయితే ఈ విషయాన్ని తెలుసుకుని మహేష్ బాబు అభిమానులు సైతం చాలా ఆనందపడుతున్నారనే చెప్పాలి. మొదట్లో రాజమౌళి టార్చర్ ని భరిస్తాడా లేదా అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేసినప్పటికి మహేష్ బాబు మాత్రం రాజమౌళి చెప్పిన ప్రతి విషయాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ తొందర్లోనే మరో షెడ్యూల్ ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి చేస్తున్న సినిమాల హైప్ విషయంలో రాజమౌళి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచం లో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా దిగ్గజ దర్శకుడిగా కూడా ఎదుగుతాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఆయన స్టార్ డమ్ ఏ విధంగా విస్తరిస్తుంది. ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…
Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో భారీ ట్విస్ట్ రివీల్ అయిందిగా…