OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘ఓజీ ‘ చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ స్పాన్ సినిమా చేయడం అసాధ్యం. కానీ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ తక్కువ డేట్స్ లోనే ఈ స్థాయి సినిమాని తీసి అందరినీ షాక్ కి గురి చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు ఫ్యాన్స్ కి ఇచ్చిన మధురమైన అనుభూతులు మామూలువి కాదు. కేవలం తెలుగు వెర్షన్ నుండే 323 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాకు ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి గడిచిన 8 నెలల్లో 12 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
అంతా బాగానే ఉంది కానీ , ఇప్పటి వరకు ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు, అసలు అవ్వుదా లేదా అనే సందేహాలు అభిమానుల్లో , ప్రేక్షకుల్లో వ్యక్తం అయ్యేవి. అయితే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ని రీసెంట్ గానే ఈటీవీ ఛానల్ మంచి రేటుకి కొనుగోలు చేసింది. మొదట్లో ఇది కేవలం రూమర్ మాత్రమే అని అంతా అనుకున్నారు , కానీ రీసెంట్ గానే ఆ ఛానల్ లో ఈ సినిమా టెలికాస్ట్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రోమో ని విడుదల చేశారు. ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు కానీ , ‘త్వరలో’ అనే ట్యాగ్ మాత్రం వేశారు. అంతే ఆగస్టు 15 న ఈ చిత్రం ఈటీవీ లో టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ కూడా వస్తాయి అని చెప్పొచ్చు.
అయితే ఈ సినిమా విడుదలైన 100 రోజుల లోపే టెలికాస్ట్ చేసి ఉండుంటే చాలా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు బాగా ఆలస్యం అయ్యింది , పైగా యాక్షన్ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా ఆదరించరు, మరి ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. థియేటర్స్ లో కూడా ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వచ్చిన సపోర్ట్ అంతంత మాత్రమే. మరి టీవీ టెలికాస్ట్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రం తో పాటు, దేవర చిత్రాన్ని కూడా ఈటీవీ సంస్థ వారు కొనుగోలు చేసినట్టు సమాచారం.





