Pawan Kalyan OG Success Celebrations: గత రెండు దశాబ్దాల నుండి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన మాట తీరు, నడవడిక అంతా ఒక లిమిట్స్ లో ఉండేవి. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉండే భయం, బెరుకు మొత్తం పక్కన పెట్టేసాడు. చాలా ఓపెన్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు. పవన్ లో చాలా మార్పులు వచ్చాయి కానీ, మూవీ ప్రొమోషన్స్ విషయం లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప, తన తోటి హీరోలు ప్రొమోషన్స్ లలో భారీగా పాల్గొనడం, ఇంటర్వూస్ ఇవ్వడం, ఇలాంటి వాటికి ఆయన చాలా దూరం. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కెరీర్ లో ఎన్నడూ చేయని ప్రొమోషన్స్ చేసాడు. లెక్కలేనన్ని ఇంటర్వూస్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ లో ఇంత మార్పు ఎలా సాధ్యం అంటూ అభిమానులు ఆశ్చర్యపోయిన సందర్భం అది.
‘ఓజీ'(They Call Him OG) చిత్రానికి కూడా ఇలాగే చేస్తాడేమో అని అంతా అనుకున్నారు కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్ప, ఆయన ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కత్తి పట్టుకొని, ఓజీ గెటప్ లో వచ్చి, అభిమానుల్లో పూనకాలు రప్పించేలా చేయడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. మన కళ్లారా చూస్తుంది, మన ఎదురుగా నిలబడింది నిజంగా పవన్ కళ్యాణ్ యేనా?, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడమే ఎక్కువ అనుకుంటే, ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి అని ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. కానీ ఆరోజు వర్షం రావడం తో ప్రీ రిలీజ్ మధ్యలోనే ఆగిపోయింది. అభిమానుల్లో కాస్త వెలతి భావం కలిగింది. అందుకే సినిమా విడుదలై సూపర్ హిట్ అవ్వడం తో మేకర్స్ అభిమానుల ఆనందం కోసం నిన్న హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఉత్సాహాన్ని చూసిన ఫ్యాన్స్ కి కడుపు నిండిపోయి,భుక్తాయాసం వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ముఖం లో సినిమా సూపర్ హిట్ అయ్యింది అనే ఆనందం ఉంది. అంతే కాదు డైరెక్టర్ సుజిత్, థమన్ చెప్పినట్టే బ్లాక్ డ్రెస్ కోడ్ లో వచ్చాడు, వాళ్లు కోరిన విధంగానే స్టైల్ గా అద్దాలు పెట్టుకొని, ఈవెంట్ కి నడుచుకుంటూ వచ్చాడు. కేవలం వాళ్ళ కోసమే ఆయన స్టేజి మీదకు వెళ్ళినప్పుడు గన్ పట్టుకొని ఫోజులు ఇచ్చాడు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉంది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శించొచ్చు కానీ, ఆయన అభిమానులు మాత్రం ఎంతో సంతోషిస్తున్నారు. లైఫ్ లో మళ్లీ పవన్ లో ఇలాంటి ఎనర్జీ ని , సంతోషాన్ని చూస్తామో లేదో, ఇలా ఆయన్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.