Pawan Kalyan OG: హీరోలందరికి ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది… ఆ స్టైల్ ను వాడుకుంటూ అభిమానులను మెప్పిస్తూ హీరోలు సక్సెసులను సాధిస్తారు…ఏ జానర్ లో సినిమాలు చేసిన కూడా ప్రేక్షకుడికి నచ్చే సినిమా లను చేసినప్పుడే హీరోలు సక్సెస్ లను అందుకుంటారు. దాంతో పాటుగా వాళ్ళ మార్కెట్ కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో పవన్ కళ్యాణ్ చేసే సినిమాలు డిఫరెంట్ స్టైల్ లో ఉంటాయి…ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా వాళ్ళ అభిమానులు ఆదరించడానికి రెడీగా ఉంటారు. టాక్ తో సంబంధం లేకుండా సినిమాను ఆదరిస్తారు…అందుకే హీరోలందరికి అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులుంటారని చెబుతుంటారు…సినిమాల్లో ఆయన చెప్పే పంచ్ డైలాగులు కొన్ని సంవత్సరాల పాటు మన వాడుకలోనే ఉంటాయి..ఆయన తన సినిమా ద్వారా ప్రేక్షకుల్లో అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాడు…2013 లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత ఆయన చేసిన ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. అయినప్పటికి అభిమానులు ఎక్కడా కూడా నిరాశ చెందలేదు… ఇక ఓజీ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానుల ఆకలి తీర్చే సినిమా ఇదే అన్నట్టుగా ఫ్యాన్స్ ఈ మూవీ మీద అంచనాలైతే పెట్టుకున్నారు.
టీజర్, ట్రైలర్లు అంచనాలను తారాస్థాయికి పెంచేసాయి…ఇక నిన్న ప్రీమియర్ షో చూసిన అభిమానుల ఆకలి తీరిపోయింది…డైరెక్టర్ సుజిత్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని కావడం వల్ల ఆయన తన అభిమాన హీరోను ఎలాగైతే చూడాలని అనుకున్నాడో అలాంటి ఒక డిఫరెంట్ స్టైల్ లో స్క్రీన్ మీద తనను ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు.
దానివల్ల పవన్ కళ్యాణ్ భారీ రేంజ్ లో ఎలివేట్ అవ్వడమే కాకుండా అంతకు మించిన ఎలివేషన్ ఇంకెవ్వరూ ఇవ్వలేరు అనేంత రేంజ్ లో సినిమాను చేశాడు… ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని అయిన పూరి జగన్నాథ్ బద్రి సినిమాతో హిట్ ఇచ్చాడు …తర్వాత ఆయనకి వీరాభిమాని అయిన హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను కట్టబెట్టాడు…ఇప్పుడు సుజీత్ ఓజీ తో పాన్ ఇండియా దద్దరిల్లిపోయే సక్సెస్ సాధించి పెట్టాడు…
పవన్ కళ్యాణ్ తో సూపర్ హిట్ తీయాలంటే ఆయన అభిమానుల వల్లే అవుతోందని ప్రూవ్ చేశారు…ఇక ఈ మధ్యకాలంలో ఒక్కో దర్శకుడు ఒక్కో రకమైన ఎలివేషన్ ఇస్తున్నాడు. సుజిత్ మాత్రం జపనీస్ స్టైల్ ను వాడుకొని ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు…ఓజి సినిమా కంప్లీట్ ఫ్యాన్స్ సినిమా…. అందుకే అభిమానులు రిపీటెడ్ గా ఈ సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారు. ప్రీమియర్స్ ముగిసిన వెంటనే సినిమాకి సక్సెస్ టాక్ రావడంతో ప్రతి ఒక్కరు ఓజీ జపం చేస్తున్నారు…