Pawan Kalyan And Sujeeth: 2019 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు పవన్ తో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యారు… దాంతో పార్టీ ఉంటుందా లేదా అనే ఒక డైలామాలో అభిమానులు ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన దగ్గర డబ్బులు లేకపోయిన కూడా సినిమాలను చేసి ఆ డబ్బులతో పార్టీని నడిపించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. ఇక ఆ సమయంలోనే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటే ‘ఓజీ’ (ఓజస్ గంభీరా)…ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఎలా ఉంటాడో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ఓజస్ గంభీరా గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్లో కనిపించాడు… కేవలం ఆయన ఆరా తోనే ఈ సినిమా మొత్తాన్ని నడిపించాడు. ఇక సుజిత్ సైతం తన మార్క్ టేకింగ్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్ అయితే పేలింది. మరి ఇలాంటి మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇకమీదట కూడా రాదు అంటూ తన అభిమానులైతే చొక్కాలు చించుకొని మరి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక సుజీత్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని ఒప్పించడానికి ఒక అబద్ధమైతే చెప్పారట. అదేంటి అంటే ఈ సినిమాని పురాణాల కథను ఆధారంగా చేసుకొని రాసినట్టుగా చెప్పాడట…అటు కర్ణుడికి, ఇటు కౌరవులకి పాండవులకి మధ్య ఎలాంటి యుద్ధం జరగబోతుంది. కర్ణుడు ఎవరి పక్షాన ఉంటాడు అనే ఫిక్షన్ అంశాలను మేళవించి ఫాంటసీలో ఈ కథను రాసినట్టుగా చెప్పారట.
నిజానికి సినిమాలో మహాభారతాన్ని బేస్ చేసుకొని మనకు ఏ సీన్లు కనిపించవు. అయినప్పటికీ అప్పుడు పవన్ కళ్యాణ్ సుజీత్ చెప్పిన కథను విని ఓకే చేశాడు. ఆ తర్వాత సుజిత్ కథలో చాలా మార్పులు చేసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు… మొదట్లో మహాభారతం బేస్ గానే కథను అనుకున్నప్పటికీ అది అంత సింక్ కాకపోవడంతో కొన్ని క్యారెక్టర్ లను అందులో జోడించి ఇలా అయితే బాగుంటుంది అనే రెండు మూడు ధోరణిల్లో ఆలోచించి కథలను రాసుకున్నాడట.
మొత్తానికైతే ఓజీ కథని ఫైనల్ గా లాక్ చేశారట… పవన్ కళ్యాణ్ అభిమానులు తనని ఎలాగైతే చూడాలి అనుకున్నారో ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ని చూపించిన ఘనత సుజీత్ కే దక్కుతోంది. సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఆయన నుంచి వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో తనకు పూర్తిగా తెలుసు… కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నింటిని అందులో రంగరించి సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపాడు…