OG Movie Update: ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ఓజీ(They Call Him OG). ఈ సినిమాకి ప్రకటన రోజు నుండే హైప్ ఆకాశాన్ని అంటింది. సెలబ్రిటీలు సైతం ఈ చిత్రం గురించి పోస్టులు చేయడం మొదలు పెట్టారు. ఇక ఎప్పుడైతే గ్లింప్స్ వీడియో వచ్చిందో , అప్పటి నుండి హైప్ ఎవరూ అందుకోలేని రేంజ్ కి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతలా అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో, మూవీ లవర్స్ మరియు యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న విడుదల చెయ్యబోతున్నాము అంటూ మేకర్స్ ఈ ఏడాది ప్రారంభం లోనే అధికారిక ప్రకటన చేసేశారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేశాడు.
Also Read: బిసిసిఐ అగ్గి మీద గుగ్గిలం.. ఇకపై ఉప్పల్ లో క్రికెట్ మ్యాచ్ లు జరగడం కష్టమే.. ఎందుకంటే?
అయితే సెప్టెంబర్ 25 మీద కేవలం ఓజీ చిత్రం మాత్రమే కాదు, ఇతర సినిమాలు కూడా కన్నేశాయి. వాటిల్లో నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ కాగా, మరొకటి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం. రెండు రోజుల క్రితం ‘విశ్వంభర’ చిత్రం సెప్టెంబర్ 18న కానీ, సెప్టెంబర్ 25 న కానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మేకర్స్ బయ్యర్స్ కి ఒక సమాచారం అందించారని, అందుకే ఓజీ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కోరితే పవన్ కళ్యాణ్ కాదు అనలేక తప్పుకుంటాడు కాబట్టి , నిజంగా ఈ చిత్రం వాయిదా పడిందేమో అని అభిమానులు బాధ పడ్డారు. సోషల్ మీడియా అంతటా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిన్న మూవీ టీం అభిమానులను పూనకాలు వచ్చే పోస్టర్ ని ఒకటి విడుదల చేసి ‘అన్ని షాట్స్ ఫైర్ చేసేశాము..ఇక థియేటర్స్ వంతు వచ్చేసింది. ‘ఓజీ’ యుగం మొదలైంది. సెప్టెంబర్ 25 న జాతరే’ అంటూ ఒక ట్వీట్ వేసాడు.
ఎవరు వచ్చినా, రాకపోయినా మాకు అనవసరం, మేము అనుకున్న తేదీలో వచేస్తున్నాము అంటూ ఓజీ మేకర్స్ మరోసారి చెప్పకనే చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి థియేటర్స్ అగ్రీమెంట్స్ కూడా పూర్తి అవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం 24 కోట్ల రూపాయలకు, సీడెడ్ ప్రాంతం 23 కోట్ల రూపాయలకు, తూర్పు గోదావరి జిల్లా 14 కోట్ల 60 లక్షల రూపాయలకు,నైజాం ప్రాంతం 90 రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. బాహుబలి 2 , పుష్ప 2 , #RRR తర్వాత ఆ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న ఏకైక చిత్రం ఇదే. అన్ని విధాలుగా డీల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. కాబట్టి అభిమానులు ఇక సంబరాలకు రెడీ అయిపోవచ్చు. ఆగష్టు మొదటి వారం నుండి అప్డేట్స్ రావడం మొదలు అవుతుందట.
All shots fired and done..
Now it’s theatres’ turn…#OG’s ERA is set to stun…#TheyCallHimOG In Cinemas September 25th. #OGonSept25 pic.twitter.com/C6S3XBxs1H— DVV Entertainment (@DVVMovies) July 11, 2025